Ukraine peace summit: ప్రపంచదేశాలు ఉక్రెయిన్ శాంతి స్థాపన కోసం పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ శాంతి స్థాపన లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన సదస్సులో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్ శాంతి స్థాపనకు మెజారిటీ దేశాలు కూడా అంగీకరించాయి. బ్రిక్స్ కూటమిలోని దేశాలతో పాటు భారత్ ఇందుకు మద్దతు ఇవ్వలేదు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరిగే ఏ శాంతి ఒప్పందాన్నికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత ప్రాతిపదిక కావాలని 80 దేశాలు వెల్లడించాయి. స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన రెండు రోజుల సదస్సులో దాదాపు 100 దేశాలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశాయి. ఈ ప్రకటనపై ప్రపంచ దేశాలు అంగీకరించాయి. కానీ భారత్ యూఏఈ తదితర దేశాలు ఏకీభవించలేదు.
ఉక్రెయిన్ శాంతి అంశంపై స్విట్జర్లాండ్‌లోని బర్గెన్ స్టార్ రిసార్ట్ లో రెండు రోజులు సదస్సు జరిగింది. శనివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదలతో ముగిసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం, ఆహార భద్రత, అను భద్రత ఖైదీల మార్పిడి వంటి అంశాల గురించి సదస్సులో చర్చించారు. ఐక్యరాజ్యసమితి ఒప్పందాలతో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా యుద్ధం ముగించే దిశగా కీలక ఒప్పందం కుదరాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
సంతకం చేయని బ్రిక్స్ సభ్య దేశాలు:
భారత్, సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఇవన్నీ బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు. వీటికి రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ లో శాంతియుత పరిష్కార మార్గం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని భారత్ స్పష్టం చేసింది. సంక్షోభ పరిష్కారానికి ముఖ్యంగా మాస్కో, కివ్ నిజాయితీగా ప్రయత్నించాలని సూచించింది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి పవన్ కపూర్ సదస్సుకు హాజరయ్యారు.