BigTV English

Tokyo: ఏంటీ.. టోక్యో నగరంలో కార్లే తిరగవా? వీళ్ల నుంచి చాలా నేర్చుకోవచ్చు బ్రో!

Tokyo: ఏంటీ.. టోక్యో నగరంలో కార్లే తిరగవా? వీళ్ల నుంచి చాలా నేర్చుకోవచ్చు బ్రో!

Tokyo: జపాన్ రాజధాని టోక్యో నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణతో ఉండడంలో ఈ సిటీ నంబర్ వన్. అక్కడ ఉండే ట్రాన్స్‌పోర్ట్ సిస్టం అంత బాగుంటుంది మరి..! అందుకే టోక్యోలో దాదాపు అందరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని మాత్రమే వాడతారు. ప్రపంచంలోనే టోక్యోలో ఉన్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టం బెస్ట్ అంట. అందుకే అక్కడ ఉండే వారు కార్లలో మాత్రమే తిరగాలని అనుకోకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు అధికంగా వాడతారు.


ప్రకృతి కోసం:
టోక్యోలో ఉండే వారు ప్రకృతిని కాపాడడంలో బాధ్యత తీసుకుంటారట. అందుకే కార్లు నడపడానికి చాలా మంది పెద్దగా ఇష్టపడరు. అక్కడ ఉండే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టంలో ఎక్కువగా క్లీన్ ఎనర్జీనే వాడతారట. దీని వల్ల కార్బన్ ఎమిషన్ కూడా తగ్గిపోతుంది. ఇది పొల్యూషన్‌ను తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే జపాన్‌లో ఉంటే మనిషి ప్రాణాలని ఇంత జాగ్రత్తగా చూసుకుంటారా అనిపిస్తుంది.

బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టం:
టోక్యోలో ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రో ట్రెయిన్‌లు, బస్సులు, సబ్ వేలు అందుబాటులో ఉంటాయి. రైళ్లు, మెట్రోలు ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా సమయానికి వస్తాయట. ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి. దీంతో వీటిలో తిరగడానికి ప్రజలు చాలా ఇష్టపడతారు. మెట్రోలు సబ్ వే ట్రెయిన్‌లో వెళ్లే ప్రయాణికులు గుంపులుగా గుంపులుగా వెళ్లి సీట్ల కోసం కొట్టుకోరు. ఒకరి తర్వాత ఒకరు లైన్‌లో వెళ్తారు. అంతేకాకుండా దివ్యాంగులు మెట్రోలోకి ఎక్కడానికి వీలుగా ఉండేందుకు సిబ్బంది సహాయం చేస్తారు.


ALSO READ: గుండు చేయించుకుంటే జుట్టు పెరుగుతుందా..?

అయితే టోక్యోలో కార్లలో తిరగడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎక్కడ చూసినా పార్కింగ్ ప్లేస్‌లు ఉంటాయి. కానీ, వాహనం పార్క్ చేయడానికి కట్టా్ల్సిన ఫీజు మాత్రం ఎక్కువగానే ఉంటుందట. అంతేకాకుండా పబ్లిక్ స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే సమయంలో కార్లలో వేళ్తే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. దీని వల్ల చేరుకోవాల్సిన సమయానికి వేళ్లడానికి చాలా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మెట్రో, సబ్ వే, రైళ్లలో వెళ్లడానికే ప్రజలు మొగ్గు చూపుతారు.

సైడ్ వాక్స్ కూడా:
ఇవి మాత్రమే కాకుండా జపాన్‌లో చాలా చోట్ల వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి ప్రత్యేకంగా సైడ్ వాక్స్ ఉంటాయి. కాలి నడకన వెళ్లాలి అనుకునే వారికి ఈ సైడ్ వాక్స్ చాలా సహాయపడతాయి. అంతేకాకుండా బైక్‌లపై వెళ్లడానికి ఇష్టపడే వారి కోసం కూడ సెపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ బక్‌లు రెంట్‌కి ఇస్తారట. అంతేకాకుండా రాత్రి సమయంలో ట్రావెల్ చేసే వారి కోసం క్యాబ్‌లు కూడా అందుబాటులో ఉంటాయట. అయితే జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సబ్ వే అందుబాటులో ఉండదు. అక్కడి ప్రజలు ఇబ్బంది పడకుండా కార్లలో వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×