BigTV English

Cow Milk Vs Buffalo Milk: ఆవు పాలు Vs గేదె పాలు, ఆరోగ్యానికి ఏవి మంచివి ?

Cow Milk Vs Buffalo Milk: ఆవు పాలు Vs గేదె పాలు, ఆరోగ్యానికి ఏవి మంచివి ?

Cow Milk Vs Buffalo Milk: పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని అధిక పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అందుకే కొంతమంది ఆవు పాలు తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు గేదె పాలు తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ రెండింటిలో ఏవి ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు.


ఆవు పాలు , గేదె పాలు రెండూ ఎక్కువ మొత్తంలో పోషకాలను కలిగి ఉన్నప్పటికీ.. వాటి లక్షణాలు, ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఇంతకీ ఏ పాలు తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


ఎముకలకు బలం:
పాలలో ఎక్కువ మోతాదులో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది . అంతే కాకుండా ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరం బలపడుతుంది. శరీరం సరిగ్గా అభివృద్ధి చెందడానికి కూడా పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ పాలు తాగడం చాలా మంచిది.

జీర్ణక్రియను మెరుగుదల:
పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా పాలు తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా.. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

చర్మానికి మేలు :
పాలలో ఉండే విటమిన్లు , ఖనిజాలు చర్మాన్ని పోషించి.. మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో కూడా సహాయపడతాయి. పాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ వాడటం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది.

గుండె ఆరోగ్యం:
పాలలో లభించే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

నిద్రకు మేలు:
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతి నిచ్చి నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల కూడా బాగా నిద్ర వస్తుంది.

ఆవు పాలు(1 గ్లాసు) Vs గేదె పాలు (1 గ్లాసు) పోషకాలు:

కేలరీలు 145 200 కేలరీలు
ప్రోటీన్ 6.4 7.3 గ్రాములు
సంతృప్త కొవ్వు 5.4 9.2 గ్రాములు
పిండిపదార్థాలు 9.8 16.5 గ్రాములు
కాల్షియం 236 242 మి.గ్రా

కేలరీలు:
-ఆవు పాలు: 145 కేలరీలు
-గేదె పాలు: 200 కేలరీలు

ప్రోటీన్:
-ఆవు పాలు: 6.4 గ్రాములు
-గేదె పాలు: 7.3 గ్రాములు

కొవ్వు:
– ఆవు పాలు: 9 గ్రాములు
-గేదె పాలు: 13 గ్రాములు

సంతృప్త కొవ్వు:
-ఆవు పాలు: 5.4 గ్రాములు
-గేదె పాలు: 9.2 గ్రాములు

కార్బోహైడ్రేట్లు:
-ఆవు పాలు: 9.8 గ్రాములు
-గేదె పాలు: 16.5 గ్రాములు

కాల్షియం:
-ఆవు పాలు: 236 మి.గ్రా.
-గేదె పాలు: 242 మి.గ్రా.

Also Read: రాత్రిపూట శుభ్రం చేయకుండా .. పాత్రలను సింక్‌లో వదిలేస్తున్నారా ? అయితే రోగాలు కొని తెచ్చుకున్నట్లే !

ఏ పాలు ఆరోగ్యానికి మంచివి ఆవు పాలా ? లేక గేదె పాలా ?

పాలలో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం , విటమిన్లు A, D, B2 (రైబోఫ్లేవిన్) , B12 పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో జింక్, ఫాస్పరస్, అయోడిన్, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఆవు పాలు ..గేదె పాల కంటే తేలికైనవి , ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కానీ రెండింటిలోనూ కొవ్వు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, బరువు పెరగాలనుకునేవారు, గుండె జబ్బులు ఉన్నవారు లేదా షుగర్ ఉన్న వారు తక్కువ కొవ్వు (టోన్డ్/స్కిమ్డ్)ఉన్న గేదె పాలు తాగాలి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×