BigTV English

Kobbari karam: ఇంట్లోనే కొబ్బరి కారం ఇలా చేసుకున్నారంటే ఇడ్లీ, దోశలతో అదిరిపోతుంది

Kobbari karam: ఇంట్లోనే కొబ్బరి కారం ఇలా చేసుకున్నారంటే ఇడ్లీ, దోశలతో అదిరిపోతుంది

ఆఫీసులకి, స్కూళ్ళకి ఉదయం ఎనిమిది లోపే బ్రేక్ ఫాస్టులు, లంచ్ బాక్సులు రెడీ చేయాలి. ప్రతిరోజు ప్రత్యేకంగా ఇడ్లీ, దోశల కోసం చట్నీ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఒకేసారి కొబ్బరి కారంపొడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇడ్లీలతో, దోశలతో తినేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కొబ్బరి కారంపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతం. తమిళులు, కన్నడిగులు ఎక్కువగా ఇష్టపడేది ఈ కొబ్బరి కారాన్నే. ఇడ్లీలో ఈ కొబ్బరి కారాన్ని నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


కొబ్బరి కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఎండు కొబ్బరి తురుము లేదా ముక్కలు – పావు కిలో
ఎండుమిర్చి – 15
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – పది

కొబ్బరి కారం రెసిపీ
1. ఎండు కొబ్బరి తురుమును తీసుకొని కళాయిలో వేయాలి.
2. స్టవ్ మీద ఆ కళాయిని పెట్టి చిన్న మంట మీద వేయించుకోవాలి.
3. ఆ తర్వాత ఆ ఎండు కొబ్బరి తురుమును తీసి పక్కన పెట్టుకోవాలి.
4. కొబ్బరి తురుముకు బదులు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవచ్చు.
5. ఇప్పుడు ఆ కళాయిలోనే ఎండుమిర్చిని వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము లేదా కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
7. అంతే టేస్టీ కొబ్బరి కారంపొడి రెడీ అయినట్టే.
8. దీన్ని గాలి చొరబడని ఒక సీసాలో వేసి దాచుకోవాలి. ఇది నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.


ఈ కొబ్బరికారాన్ని బెండకాయ ఫ్రై లేదా దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై వంటివి చేస్తున్నప్పుడు చల్లుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. లేదా వేడి వేడి అన్నంలో ఒక స్పూను వేసుకొని తిన్నా రుచిగా ఉంటుంది. దోశలు చేస్తున్నప్పుడు పైన ఈ కొబ్బరికారాన్ని చల్లి తింటే చట్నీ కూడా అవసరం లేదు. కొబ్బరి కారం ప్రాచీన కాలం నాటి రెసిపీ. దీనిలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.

Related News

Blood Sugar: ఏంటీ.. టూత్ పేస్ట్‌‌తో షుగర్ పెరుగుతుందా ?

Goat Milk Benefits: మేక పాలు తాగితే.. మతిపోయే లాభాలు, తెలిస్తే అస్సలు వదలరు !

Chai-Biscuit: చాయ్‌తో బిస్కెట్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు

Tomato Pulao: క్షణాల్లోనే రెడీ అయ్యే టమాటో పులావ్.. తింటే మైమరచిపోతారు !

Mushroom Curry: మష్రూమ్ కర్రీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి !

Kidneys: మీలో ఈ అలవాట్లున్నాయా ? వెంటనే మానేయండి !

Almonds Side Effects: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? ఈ సమస్యలు తప్పవు !

Greek Yoghurt Vs Hung Curd: గ్రీక్ యోగర్ట్, హంగ్ కర్డ్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్ ?

Big Stories

×