Railway New Rule: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకొస్తుంది భారతీయ రైల్వే. అందులో భాగంగానే తాజాగా కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే జరిమానా కట్టకతప్పదని హెచ్చరించింది. ఇంతకీ, ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే..
ఇంటి ఫుడ్స్ తీసుకురావద్దన్న రైల్వే అధికారులు
సాధారణంగా రైల్వే ప్రయాణం అనగానే చాలా మంది దారితో తినేందుకు చపాతీలు, పూరీలు, భోజనం తీసుకెళ్తుంటారు. కానీ, ఇకపై అలా తీసుకెళ్లకూడదని రైల్వే అధికారులు హెచ్చరించారు. ఒకవేళ అలాగే తీసుకెళ్తూ పట్టుబడితే, ఫైన్ కట్టకతప్పదన్నారు. వాస్తవానికి రైళ్లలో ఆహారం తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని నీట్ గా చెత్త బుట్టలో వేయాలి. కానీ, కొంత మంది ఇష్టం వచ్చినట్లు రైలు కోచ్ లో పడేస్తున్నారు. తాజాగా ప్రయాగ్ రాజ్ డివిజన్ లో రైల్వే అధికారులు చెకింగ్ సందర్భంగా చాలా కోచ్ లలో ఆహారాన్ని అడ్డగోలుగా పడేసినట్లు గుర్తించారు. దానికి కారణం అయిన ప్రయాణీకులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి జరిమానా విధించారు.
ఆహారం పడేసిన వారికి రూ. 32 లక్షల జరిమా
రైల్వే కోచ్ ల శుభ్రతపై రైల్వే అధికారులు కఠిన చర్యలు అవలంభించారు. కేవలం ప్రయాగరాజ్ డివిజన్ లో ఇంటెన్సివ్ చెకింగ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్లో చెత్త వేసిన వారితో పాటు పొగ తాగిన ప్రయాణికులపై చర్యలు తీసుకున్నారు. మొత్తం 26,964 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.32,63,050 జరిమానా వసూలు చేశారు. ఇందులో, చెత్త వేసిన వారు 26,253 మంది ప్రయాణికులు ఉండగా, రూ.31,23,925 జరిమానా వేశారు. ధూమపానం చేసిన 711 మంది ప్రయాణికుల నుంచి రూ.1,39,125 వసూలు చేశారు.
Read Also: ఫ్రీగా ఫ్లైట్ జర్నీ, వారికి మాత్రమే అవకాశం!
అదే సమయంలో ప్రయాగరాజ్ డివిజన్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు మంచి ఆహారం, పరిశుభ్రమైన నీరు, శుభ్రమైన టాయిలెట్లు లాంటి సౌకర్యాలను అందించాలని భావిస్తోంది. అలాగే, టికెట్ లేని ప్రయాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా రైళ్లు, స్టేషన్లను శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైళ్లు, స్టేషన్ ప్రాంగణంలో చెత్త వేయడం, ధూమపానం చేయడం తీవ్రమైన నేరం. అలా చేసే ప్రయాణీకులకు జరిమానా, జైలు శిక్షతో పాటు కొన్నిసార్లు రెండూ విధించబడతాయి. ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి, రైల్వే నియమాలను పాటించేలా చేయడానికి ఇంటెన్సివ్ చెకింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రచారాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను సంబంధిత డస్ట్ బిన్ లలో మాత్రమే వేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడవేయడం వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Read Also: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!