E-Paper
Advertisement

ఓయూ లా కాలేజీ హాస్టల్‌పై వివాదం.. భవనం కూల్చివేతతో విద్యార్థుల ఆగ్రహం!

ఓయూ లా కాలేజీ హాస్టల్‌పై వివాదం.. భవనం కూల్చివేతతో విద్యార్థుల ఆగ్రహం!
Advertisement

OU Hostel: ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలిచిన యూనివర్సిటీ లా కాలేజీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2014 నుంచి 2026 వరకు కాలేజీలో మౌలిక వసతులు, ముఖ్యంగా విద్యార్థుల వసతి గృహాల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితికి బాధ్యులు యూనివర్సిటీ అధికారులా? లేక ప్రభుత్వమా? అన్న ప్రశ్నలు విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాస్టల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించినప్పటికీ, ప్రతిపాదిత హాస్టల్ నిర్మాణం ఎందుకు పూర్తికాలేదన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి? వాటిని ఇతర అవసరాలకు మళ్లించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆలోచన సరైనదేనా?

ప్రస్తుతం లా కాలేజీకి సమీపంలో ఉన్న ఈ-1 హాస్టల్ భవనాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతులు, వాష్‌రూమ్‌ల ఆధునీకరణ, రంగులు వేయడం, నీటి పైప్‌లైన్‌ల మరమ్మతులు వంటి పనులు చేపడితే మరో 50 ఏళ్లపాటు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ-1 హాస్టల్ నుంచి లా విద్యార్థులను తొలగించి ఓల్డ్ సీ హాస్టల్‌కు తరలించాలనే ప్రతిపాదనలు విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలని కోరుతున్నారు. బీఈడీ, లా కాలేజీ, నిజాం కాలేజీ విద్యార్థులను కలిపి ఒకే హాస్టల్‌లో ఉంచాలనే ఆలోచన సరైనదేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా కళాశాలల విద్యా క్యాలెండర్లు, తరగతుల సమయాలు, మెస్ నిర్వహణ, విద్యార్థుల అవసరాలు భిన్నంగా ఉంటాయని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు.

Advertisement

A;lso Read: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

2019 నుంచి 2026 వరకు..

ప్రతి కళాశాలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం ఉండటం విద్యార్థుల భద్రతకు, చదువుకు, క్రమశిక్షణకు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇదే విధానాన్ని అనుసరిస్తే ఆర్ట్స్, సైన్స్, పీజీ కళాశాలల విద్యార్థులందరికీ కలిపి ఒకే హాస్టల్ ఏర్పాటు చేయవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి 2026 వరకు లా కాలేజీకి వచ్చిన నిధులు, హాస్టల్ నిర్వహణకు కేటాయించిన బడ్జెట్, ఖర్చు చేసిన మొత్తాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు నిధులు కేటాయించినప్పటికీ మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని, నిధులు ఏయే పనులకు ఖర్చు చేశారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఖర్చులకు సంబంధించిన రికార్డులు, ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచారా? అనే అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నిలదీస్తున్నారు. లా కాలేజీ హాస్టల్ సమస్యను రాజకీయ కోణంలోకి తీసుకెళ్లకుండా విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ముఖ్యమని పేర్కొంటున్నారు.

లా కాలేజీ హాస్టల్‌ తొలగింపు ప్రతిపాదన నిలిపివేయాలి..

Advertisement

ఈ-1 లా కాలేజీ హాస్టల్‌ తొలగించే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలి. హాస్టల్ భవనానికి సాంకేతిక నిపుణులతో నాణ్యత, భద్రతా తనిఖీలు నిర్వహించాలి. అవసరమైన మరమ్మతులు, వాష్‌రూమ్‌లు, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలి. 2019-2026 మధ్య కేటాయించిన నిధుల వినియోగంపై విచారణ జరపాలి. విద్యార్థులతో చర్చించకుండా హాస్టల్ మార్పుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు చేపట్టాలి. రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీ భీంరావు నాయక్ అన్నారు.

Also read: పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

Tags

Related News

రెవెన్యూ శాఖ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫైర్!

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి వీసీ జానయ్య లేఖ

హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్లు అరెస్ట్!

రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన!

సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!

బిర్యానీ ఆలస్యమైందని ప్రశ్నిస్తే.. కత్తులతో దాడి చేసిన యాజమాన్యం!

Big Stories

Advertisement
×