Korean Hair Care: ఈ రోజుల్లో అమ్మాయిల నుండి అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరూ కొరియన్ డ్రామా అంటే చాలా ఇష్టపడుతున్నారు. కొరియన్ డ్రామాలు చూడటానికి చాలా బాగుంటాయి అందుకే యూత్ కు ఇవంటే చాలా ఇష్టం. వీరి ప్రేమకథలు చాలా ప్రసిద్ధి చెందాయి. వీటితో పాటు కొరియన్ అమ్మాయిల స్కిన్ తో పాటు, హెయిర్ కూడా అందరూ ఇష్టపడతారు. ప్రస్తుతం కొరియన్ స్కిన్ కేర్ చికిత్సలు , హెయిర్ ట్రీట్‌మెంట్‌లు పార్లర్‌లలో కూడా చేయడం ప్రారంభించటానికి కారణం ఇదే.
కొరియన్ హెయిర్ కేర్ రొటీన్లు జుట్టును లోతుగా శుభ్రపరచడంతో పాటు పోషణ అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. మీరు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా కొరియన్ అమ్మాయిల మాదిరిగా సిల్కీ , మెరిసే జుట్టును పొందాలనుకుంటే మాత్రం కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. వీటిని అనుసరించడం ద్వారా మీరు కూడా అలాంటి జుట్టును పొందవచ్చు. ఈ రెమెడీలను ఉపయోగించడానికి, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఇందు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. మీ జుట్టును సిల్కీగా, మృదువుగా మార్చగల రెండు సులభమైన, ప్రభావవంతమైన కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తల చర్మం శుభ్రం చేయడం ముఖ్యం:
కొరియన్ హెయిర్ కేర్ రొటీన్‌లో స్కాల్ప్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం, మీ తలపై ఉన్న జుట్టుకు గోరువెచ్చని నూనెను అప్లై చేయడం అలవాటు చేసుకోండి.
రక్త ప్రసరణను పెంచడానికి, తలపై ఉన్న మురికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయండి. జుట్టు మీద ఆయిల్‌ను 30 నిమిషాల నుండి 1 గంట వరకు ఉంచండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు తగిన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
దీని తర్వాత జుట్టు వాష్ చేయాలి. ఇప్పుడు జుట్టును వాష్ చేయడం కోసం సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. షాంపూను జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి. జుట్టు చివర్లలో ఎక్కువ షాంపూ వాడకూడదని గుర్తుంచుకోండి.
హెయిర్ మాస్క్ వాడకం:
కొరియన్ అమ్మాయిలు జుట్టును హైడ్రేట్‌గా ఉంచడానికి సహజమైన హెయిర్ మాస్క్‌లు, హెయిర్ ఎసెన్స్ వాటర్‌ను ఉపయోగిస్తారు. ఇది జుట్టు యొక్క తేమను తగ్గించడంతో పాటు వాటిని సిల్కీగా , మృదువుగా చేయడానికి సహాయపడుతుంది దీన్ని ఉపయోగించడానికి, మొదట ఇంట్లో సహజమైన హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయండి.
ఇందుకోసం అవకాడో, అలోవెరా జెల్, తేనె కలిపి జుట్టుకు పట్టించాలి. దీన్ని 20-30 నిమిషాల పాటు జుట్టుకు పట్టించి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
Also Read: ఆకర్షణీయమైన ఐబ్రోస్ కోసం.. ఇలా చేయండి
దీని తరువాత, హెయిర్ ఎసెన్స్ వాటర్ సిద్ధం చేయడానికి, రోజ్ వాటర్, కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని స్ప్రే బాటిల్‌లో కలపండి. జుట్టు వాష్ చేసిన తర్వాత జుట్టు మీద దీనిని స్ప్రే చేయండి. ఇది కండీషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా మార్చుతుంది.