Rashmika mandanna:నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గాయాల పాలైనట్టు తాజాగా ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ రష్మిక మందన్నకి ఏమైంది..? ఆమెకు గాయం ఎలా అయింది? అనేది ఇప్పుడు చూద్దాం.. ‘ఛలో’ మూవీతో తెలుగు చిత్ర సీమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అంతకుముందే కిరిక్ పార్టీతో కన్నడలో అలరించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఛలో మూవీ తర్వాత రష్మిక మందన్నా కెరియర్ మారిపోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay deverakonda) తో కలిసి ‘గీతాగోవిందం’ సినిమా చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చేసి మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తో చేసిన ‘పుష్ప’, పుష్ప 2,సినిమా తర్వాత రష్మిక మందన్నా రేంజే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేసి మరింత పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగు. అలా రష్మిక మందన్నాకి కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అవకాశాలు కోకోల్లలుగా వస్తున్నాయి.
జిమ్ లో గాయపడ్డ రష్మిక..
అలా నార్త్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) తో ‘ సికిందర్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుండగా.. తాజాగా రష్మిక మందన్నాకి గాయం అవ్వడం బాధాకరం.. మరి రష్మిక మందన్నాకి గాయం అవ్వడానికి కారణం ఏంటంటే.. జిమ్ లో వ్యాయామం చేస్తూ ఉన్న సమయంలో రష్మికకు గాయమైనట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పుష్ప-2 సినిమా తర్వాత తరచూ జిమ్లో కనిపిస్తున్న రష్మిక మందన్నా, తన నెక్స్ట్ మూవీ కోసం తెగ వ్యాయామాలు చేసేస్తోంది. జిమ్ లో తెగ కష్టపడుతూ సల్మాన్ ఖాన్ సినిమా కోసం వర్కౌట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్నాకి గాయం అయినట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఆమె టీమ్స్ స్పందించలేదు. కానీ రష్మిక మందన్నా గాయం నుండి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.
రష్మిక మందన్న సినిమాలు..
ఇక రష్మిక మందన్నా సినీ కెరియర్ విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తో పాటు రెయిన్ బో, సికిందర్,ఛావా, కుబేర వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా తో కూడా రష్మిక ఓ సినిమా చేస్తోంది. సౌత్ లో ప్రస్తుతం రష్మిక మందన్న, ధనుష్ తో నటించిన కుబేర మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే యానిమల్-2 సీక్వెల్ లో కూడా రష్మిక మందన్న కనిపించబోతుంది. అలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నా, జిమ్ లో గాయపడడం చాలా బాధాకరం.