E-Paper
Advertisement

కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!

కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Supreme Court: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. మధురై జిల్లా కలెక్టర్ తీరును తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందని స్పష్టం చేసింది.

కలెక్టర్ తీరుపై ధర్మాసనం అసహనం

విచారణ సందర్భంగా మధురై కలెక్టర్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టు చెప్పిన పనిని మీరు చేయాల్సింది. మీరు ఒక జిల్లా మెజిస్ట్రేట్’ అని ప్రశ్నించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎవరూ నీరుగార్చలేరని.. రాజ్యాంగపరమైన గందరగోళాన్ని సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోమని జస్టిస్ అరవింద్ కుమార్ ఘాటుగా హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు కలెక్టర్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టును కొంత సమయం కోరారు.

ఆలయ ట్రస్టీ బోర్డుపై తీవ్ర విమర్శలు

Advertisement

మరోవైపు తిరుపరంకుండ్రం ఆలయ ట్రస్టీ బోర్డుపైనా సుప్రీంకోర్టులో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని పేర్కొన్న పిటిషనర్లు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ఆలయ ట్రస్టీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రస్టీ బోర్డు సభ్యులు భక్తులు కారని, వారంతా ప్రభుత్వ రాజకీయ నియామకాల ద్వారా ఆ పదవుల్లోకి వచ్చారని పిటిషనర్ల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు.

‘మళ్లీ దీపం వెలిగించాలి’

దీపతూన్ స్తంభంపై ఇకనైనా దీపం వెలిగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ ప్రక్రియను స్వతంత్ర అథారిటీ పర్యవేక్షించాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఆయన సూచించారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారి వాదనలు వినే ముందే దీపం వెలిగించే ప్రక్రియ జరిగిపోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ 11 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి మరుసటి రోజే దీపం వెలిగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

Also Read: డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

అసలేం జరిగిందంటే..

సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ నవంబర్ 24న తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం (దీపతూన్)పై కార్తీక దీపాన్ని వెలిగించలేదు. దీనికి బదులు ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపాన్ని వెలిగించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన మధురై జిల్లా కలెక్టర్.. దీపతూన్ వద్ద దీపం వెలిగించకూడదని అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. దీపం వెలిగించకపోవడంపై ఆయన క్షమాపణలు సైతం చెప్పారు. ఈ తప్పిదానికి ఆలయ ట్రస్టీలదే బాధ్యత అని కోర్టుకు స్పష్టం చేశారు.

Also Read: ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా…ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?

Tags

Related News

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

అన్నదమ్ముల ఘాతుకం.. భార్యలను చంపి అడవిలో పాతిపెట్టి ఆ తర్వాత, జార్ఖండ్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!

Big Stories

Advertisement
×