E-Paper
Advertisement

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!
Advertisement

Shocking Cave Rescue Video: ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లినప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకోవడం చాలామందికి ఇష్టం. అందమైన ప్రదేశాల్లో కొత్త అనుభూతులను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే, కొన్నిసార్లు సరదాగా చేసే చిన్న పనులు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలు తీసుకోవడానికి వెళ్లిన ఓ మహిళ ఇరుకైన రాతి గుహలో చిక్కుకుపోయింది. బయటకు రాలేక భయంతో ఏడుస్తూ సాయం కోసం వేడుకుంటున్న వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేసింది.

ఫొటోల కోసం వెళ్లి చిక్కుకుపోయిన మహిళ

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ రాళ్ల మధ్య ఉన్న ఇరుకైన గుహలాంటి ప్రదేశంలో ఇరుక్కుపోయి కనిపిస్తోంది. గుహ లోపలికి వెళ్లిన ఆమె తిరిగి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రాళ్ల మధ్య ఉన్న చిన్న సందులో ఆమె ఇరుక్కుపోవడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. మొదట బయటకు రావడానికి ప్రయత్నించిన ఆమె.. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో భయపడిపోయింది. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనను బయటకు తీసుకురావాలని అక్కడున్న వారిని వేడుకుంది. చుట్టూ చీకటిగా ఉండటం, బయటకు వెళ్లేందుకు సరైన మార్గం కనిపించకపోవడంతో ఆమె ఆందోళన మరింత పెరిగింది.

టార్చ్ లైట్లతో సహాయక చర్యలు

Advertisement

మహిళ గుహలో చిక్కుకుపోవడంతో అక్కడున్న వారు ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. టార్చ్ లైట్ల సహాయంతో గుహలోపల పరిస్థితిని పరిశీలిస్తూ ఆమెకు ధైర్యం చెప్పారు. ముందుగా ఆమె వెంట ఉన్న బ్యాగ్‌ను పక్కకు తొలగించారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో సదరు మహిళ భయంతో ఏడుస్తూ కనిపించడం వీడియోలో కనిపించింది. ఇరుకైన ప్రదేశం కావడంతో ఆమెను బయటకు తీసుకురావడం అంత ఈజీ కాలేదు. అయినప్పటికీ అక్కడున్న వారు ఎంతో జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.

చివరకు బయటపడిందా?

వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టులను చూస్తుంటే, అక్కడున్న వారి సాయంతో మహిళ చివరకు సేఫ్ గా  బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన నేపాల్ లో జరిగినట్లు చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది? మహిళకు ఏమైనా గాయాలయ్యాయా? అనే వివరాలు తెలియలేదు.

సరదా కోసం చేసే సాహసాలతో జాగ్రత్త!

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫొటోలు తీసుకోవాలని ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లడం అవసరమా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో గుహలు, ఇరుకైన సందుల్లో కనిపించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చే మార్గం ఉందో? లేదో? తెలుసుకోకుండా ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్లకూడదంటున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Read Also: రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

Tags

Related News

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

రన్నింగ్ ట్రైన్ లో హారతి వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?

పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

టికెట్లపై 20% డిస్కౌంట్.. ఇండియన్ ట్రావెలర్స్ కు ఎతిహాద్ అదిరిపోయే ఆఫర్!

Big Stories

Advertisement
×