Long Hair Tips: ప్రతి ఒక్కరూ పొడవాటి , అందమైన జుట్టును కోరుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్‌లో కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు అనేక కారణాల వల్ల జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది జుట్టు పొడవుగా, దృఢంగా ఉండేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కొందరు ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే మరికొందరు హోం రెమెడీస్ వాడుతుంటారు.
అయితే ఇంట్లోనే కొన్ని సులువైన చిట్కాలు పాటించడం వల్ల మీరు మీ జుట్టును నడుము వరకు పొడవుగా, దృఢంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అవును, దీని కోసం మీరు కొబ్బరి నూనెలో కొన్ని ప్రత్యేక పదార్థాలను మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయాలి. మీ జుట్టును వేగంగా ,పొడవుగా , బలంగా మార్చడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనె యొక్క ప్రయోజనాలు:
కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టుకు పోషణతో పాటు, బలపరుస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోయి వాటికి పోషణను అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.
జుట్టును బలపరుస్తుంది.
జుట్టులో తేమను కాపాడుతుంది.
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.
జుట్టును మెరిసేలా చేస్తుంది.
శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరి నూనె ఒకటే వాడినా కూడా అది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కానీ మీరు దానిలో మీరు కొన్ని రకాల పదార్థాలు కలపడం వల్ల దాని ప్రభావం చాలా రెట్లు పెరుగుతుంది.
కొబ్బరి నూనెలో కలపవలసిన పదార్థాలు:
1.మెంతి గింజలు జుట్టును బలపరుస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
2.గూస్బెర్రీ జుట్టుకు పోషణ అందివ్వడంతో పాటు,పెరుగుదలకు సహాయపడుతుంది.
3.ఆముదం జుట్టు ఒత్తుగా చేయడంతో పాటు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4.గుడ్డు జుట్టుకు ప్రొటీన్‌ని అందజేసి, దృఢంగా చేస్తుంది.
5.పెరుగు జుట్టును మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును తొలగిస్తుంది.
6.అలోవెరా జుట్టుకు పోషణనిస్తుంది, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
7. ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. పెరుగుదలకు సహాయపడుతుంది.
1. మెంతి గింజలు:
మెంతులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ప్రొటీన్ , నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టుకు బలం చేకూరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో మెంతి గింజలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఉపయోగించే విధానం:
2 చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే గ్రైండ్ చేసి ఈ పేస్ట్‌ని కావలసినంత పెరుగు తీసుకుని అందులో కొబ్బరి నూనెలో కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలపై అప్లై చేయండి. 1 గంట తర్వాత జుట్టును వాష్ చేసుకోండి.
Also Read: జుట్టు రాలుతోందా ? వీటిని వాడితే.. అస్సలు రాలదు
2. ఉసిరి:
ఉసిరి విటమిన్ సికి మంచి మూలం. ఇది జుట్టుకు పోషణతో పాటు వాటిని బలపరుస్తుంది. ఉసిరి జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా వాటిని వేగంగా పెంచడంలో సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం:
ముందుగా 2 టీస్పూన్ల ఉసిరి పొడిని తీసుకోండి. అందులో మీకు కావలసినంత కొబ్బరి నూనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి . ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.