BigTV English

Fat and Tea: పొట్ట కొవ్వును త్వరగా తగ్గించాలా? అయితే ప్రతిరోజు ఇలా టీ చేసుకుని తాగండి

Fat and Tea: పొట్ట కొవ్వును త్వరగా తగ్గించాలా? అయితే ప్రతిరోజు ఇలా టీ చేసుకుని తాగండి

Fat and Tea: బెల్లీ ఫ్యాట్ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. అందులో ముఖ్యమైనది పుదీనా అల్లం టీ. ఈ రెండింటినీ కలిపి టీ చేసుకొని తాగితే కొన్ని రోజుల్లోనే పొట్ట దగ్గర కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.


కాలేయంలో కొవ్వు
కొవ్వు శరీరంలో అధికంగా పేరుకుపోవడం వల్ల కాలేయం కూడా ఇబ్బందిపడుతుంది. కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తాగే వారికే కాదు ఆల్కహాల్ తాగిన వారికి కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు ఇలా పుదీనా అల్లం కలిపి టీ చేసుకుని తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు.

చెడు ఆహారపు అలవాట్ల వల్ల అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయి కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోవచ్చు. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత అధికంగా ఉంటుంది. అందుకే వారిలో కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం అధికంగానే ఉంటుంది. వీరందరూ కూడా పుదీనా అల్లం వేసిన టీని తాగాల్సిన అవసరం ఉంది. ఈ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, డిటెక్స్ఫికేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని రిఫ్రెష్ చేస్తాయి.


కొవ్వును విచ్చిన్నం చేసే ఆహారాన్ని తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఒకేసారి కొవ్వును కరిగించడం కష్టం ప్రతిరోజు పుదీనా అల్లం టీ ని తాగడం వల్ల మెల్లగా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయవచ్చు.

పుదీనా అల్లం టీ తయారీ
పుదీనా అల్లం టీ చేయడం చాలా సులువు. పుదీనా తరుగు అల్లం తరుగును సిద్ధం చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు వేయండి. అందులో పుదీనా తరుగు, అల్లం తరుగును వేయండి. బాగా మరగ కాచి వడకట్టి ఆ నీటిని తాగేయండి. అవసరం అనుకుంటే ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు. తేనెను కలుపుకోవడం వల్ల ఇది మరింత బలంగా మారుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ లక్షణాలు రెట్టింపు అవుతాయి. ఈ టీని ప్రతిరోజూ తాగి చూడండి. నెల రోజుల్లో మీ శరీరంలో మార్పును గమనిస్తారు. మీకు మీరే ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

మన శరీరంలో ఉన్న విషాలను ఫిల్టర్ చేయడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాలేయంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా ఇది ప్రాసెస్ చేసి బయటికి పంపిస్తుంది. దీనివల్ల కాలేయంపై ఉండే అదనపు ఒత్తిడి తగ్గుతుంది. పుదీనా, అల్లం రెండూ జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. కాబట్టి ఈ రెండింటి కలయికలో టీ తాగడం అన్ని రకాలుగా మంచిదే.

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు పుదీనా అల్లం టీ ని తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత సమస్యను వారు సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది. పుదీనాలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం రెండుసార్లు ఈ పుదీనా అల్లం టీ ని తాగేందుకు ప్రయత్నించండి.

Read Also: ఆ జపాన్ విలేజ్‌లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తాయ్, ఎందుకంటే?

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పుదీనా అల్లం టీ ఎంతో మేలు చేస్తుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచి కొవ్వు విచ్చిన్నతను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మీరు సహజంగానే బరువు తగ్గిపోతారు. కేవలం నెల రోజుల్లోనే మీ బరువులో ఎంతో తేడా కనిపిస్తుంది. అలాగే రక్తంలో పేరుకుపోయిన అదిగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి హానికర సమ్మేళనాలను తొలగించడానికి ఈ టీ ఉపయోగపడుతుంది. తద్వారా కాలేయ ఆరోగ్యాన్నే కాదు, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×