OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అడ్వెంచర్ మూవీస్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అడ్వెంచర్ మూవీలను మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఈ మూవీలు ప్రజెంట్ చేస్తారు మేకర్స్. అటువంటి ఒక మూవీ ఓటిటిలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇది ఒక హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ. విక్టర్ అనే సైంటిస్ట్ చనిపోయిన వాటిని బ్రతికించే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ ప్రయోగాల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. మూవీ పేరు “విక్టర్ ఫ్రాంకెన్ స్టెయిన్ ” (Victor Frankenstein). ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీలో విక్టర్ ఒక సైంటిస్ట్ గా ఉంటూ చనిపోయిన జంతువులను బ్రతికించే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. విక్టర్ ఒకరోజు సర్కస్ షో కి వస్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి సర్కస్ చేస్తూ కింద పడిపోతుంది. అక్కడే పని చేసే ఈగోర్ ఆమెను కాపాడుతాడు. ఈగోర్ వెన్నెముక సరిగా లేకపోవడంతో బాధపడుతూ, చాలా బుక్స్ చదివి శరీరంలోని అవయవాల గురించి తెలుసుకుంటాడు. ఆ విధంగానే హీరోయిన్ ని కాపాడుతాడు. ఇది చూసిన విక్టర్ అతనిని అభినందించి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదని సర్కస్ కంపెనీతో గొడవపడి అతన్ని తన వెంట తీసుకువెళ్తాడు. అక్కడ ఈగోర్ వెన్నెముకను తన మందులతో సరిచేస్తాడు విక్టర్. ఈగోర్ సాయంతో ఒక చనిపోయిన చింపాంజీని విక్టర్ బతికిస్తాడు. ఈ ప్రయోగాలను ఆపాలని ప్రభుత్వం ఇతని పై చర్యలు తీసుకుంటుంది. అయితే ఒక ధనవంతుడైన విక్టర్ ఫ్రెండ్ ఈ ప్రయోగాలు మరొక ప్రదేశంలో కంటిన్యూ చేయాలని చెప్తాడు. అందుకుగాను ఆర్థిక సాయం చేస్తానని అనటంతో, విక్టర్ ప్రయోగాలు చేయడానికి ఒప్పుకుంటాడు.
కానీ ఈ గోర్ కి ఈ విషయం ఇష్టం ఉండదు. ఈ గోర్ తో విక్టరీ గొడవపడి ప్రయోగాలు చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ధనవంతుడు ఈగోర్ని కాళ్లు చేతులు కట్టేసి ఒక నదిలో పడవేస్తూ, ప్రయోగాలు అయిపోయినాక విక్టర్ ని కూడా చంపేస్తానని చెప్తాడు. అక్కడినుంచి కష్టపడి తప్పించుకొని తన ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. వీరిద్దరూ కలసి విక్టర్ని కాపాడాలని వెళతారు. ఈ క్రమంలో వీళ్లు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి వీళ్లు విక్టర్ ని కాపాడతారా? విక్టర్ చివరికి ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తాడా? ఆ ధనవంతుడి కుట్ర నుండి వీళ్లు బయటపడగలిగారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతున్న “విక్టర్ ఫ్రాంకెన్ స్టెయిన్ ” అనే ఈ మూవీని తప్పకుండా చూడండి.