BigTV English

Valentine’s Day Quotes : వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ కోట్స్ తో ప్రపోజ్ చేయండి.. నో చెప్పరు..

Valentine’s Day Quotes : వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ కోట్స్ తో ప్రపోజ్ చేయండి.. నో చెప్పరు..

Valentine’s Day Quotes for Lovers : వాలెంటైన్స్ డే.. ప్రేమికుల దినోత్సవం.. ఈ రోజు కోసం ప్రపంచవ్యాప్తంగా.. కొన్ని కోట్ల జంటలు ఎదురుచూస్తున్నాయి. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ప్రేమికుల దినోత్సవం రానే వచ్చింది. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు.. తమ ప్రేయసి, ప్రియులకు గిఫ్ట్స్ ఇచ్చి.. తామెంతో ప్రేమిస్తున్నారో చెబుతారు. మరికొందరు.. ఈరోజే తమ ప్రేమను ఇష్టమైన వ్యక్తికి తెలియజేస్తారు. వాలెంటైన్స్ డే సందడి.. ఫిబ్రవరి 7 నుంచే మొదలవుతుంది.


Read More : వాలంటైన్ డే చరిత్ర ఇదీ..!

ఈ వాలెంటైన్ వీక్ లో ఫిబ్రవరి 7న రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే తో.. వాలెంటైన్ వీక్ ముగుస్తుంది. మరి మీరు మీ ప్రేయసి లేదా ప్రియుడి పట్ల మీకున్న ప్రేమను మాటల రూపంలో తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారా. మీకోసం కొన్ని మధురమైన కొటేషన్స్ ను అందిస్తున్నాం. వీటితో మీ ప్రియతమ వ్యక్తికి మీలో ఉన్న ప్రేమను వ్యక్తం చేయండి.


1.Roses are Red, Violets are Blue.. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున నేను నీకు కృతఘ్నుడిని. హ్యాపీ వాలెంటైన్స్ డే మై డియర్.

2.నా ఆనందం, కష్ట సమయాల్లో నాతో ఉన్నందుకు Thank You. నువ్వు ఎప్పటికీ ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండు. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్ బెస్ట్ ఫ్రెండ్.

3.నువ్వు లేకుండా నేను లేను. నువ్వే నా సర్వం.. సర్వస్వం. నువ్వే నా జీవితం అయినందుకు Thank You. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.

4.ప్రేమ గురించి చాలా పుస్తకాలు చదివాను. చాలా సినిమాల్లో ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. కానీ.. ప్రేమ అంటే అర్థం ఏంటో నిన్ను కలిశాకే తెలిసింది. హ్యాపీ వాలెంటైన్స్ డే డార్లింగ్.

5.చీకటి రోజుల్లో నాకు సన్ షైన్ నువ్వు.
నా పెదవులపై చిరునవ్వుకి కారణం నువ్వు.
నా జీవితాన్ని ప్రేమతో నింపిన నీకు.. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

Read More : మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఓ ముద్దు ఇవ్వండి..!

6.మనం ఇద్దరం కలిసి ఎంత ఎక్కువ సమయం గడుపుతామో.. నేను నీతో అంత ఎక్కువ ప్రేమలో పడతాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.

7.ప్రేమ పై ఉన్న ప్రతి పాట నీకే అంకితం. హ్యాపీ వాలెంటైన్స్ డే.

8.నిన్ను కలవక ముందు వాలెంటైన్స్ డే అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ.. నిన్ను కలిసిన క్షణం నుంచీ ప్రేమ అంటే ఏంటో ప్రతిక్షణం అనుభూతి చెందుతున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.

9.నువ్వే నా ప్రపంచం. నువ్వుంటే రోజంతా ప్రేమ, నవ్వులతో నిండిపోతుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే మై డియర్ లవ్.

10.నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం.
నిన్ను చూసిన క్షణం నుంచీ నా జీవితం పరిపూర్ణం.
నా జీవితాన్నే మార్చేసిన నీకు.. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రియతమా..

Read More :  ప్రపంచంలో విచిత్రమైన వంటకాలు!

11.దేవుడే దిగి వచ్చి.. నీకు జీవిత భాగస్వామిగా ఎవరు కావాలంటే.. ఏడేడు జన్మలకూ నిన్నే కోరుకుంటాను. నా జీవితాన్ని, కలల్ని పంచుకున్న నీకు హ్యాపీ వాలెంటైన్స్ డే.

12.చావైనా, బ్రతుకైనా నీతోనే. జీవితం మొత్తానికీ నువ్వే నా సర్వస్వం. హ్యాపీ వాలెంటైన్స్ డే మై డార్లింగ్.

13.ఒకరోజు ఎవరో ప్రేమ గురించి చెప్పారు. అప్పుడు ప్రేమంటే ఏంటో అర్థం కాలేదు. నిన్ను కలిసిన క్షణం, నీ ప్రేమను పొందిన నిమిషం.. ప్రేమంటే ఏమిటో తెలిసింది. హ్యాపీ వాలెంటైన్స్ డే మై స్వీట్ హార్ట్.

14.నేను చాలా విచిత్రమైన వ్యక్తిని. అలాంటి నన్ను ప్రేమించేలా చేశావు. నాకు ప్రేమను పంచావు. ఈ జీవితంలో నీకు నేను.. నాకు నువ్వు తప్ప.. ఇంకెవరూ వద్దు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే మై లవ్.

15.I LOVE YOU. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిజానికి నిన్ను చూడకముందు నుంచే.. నా గుండెల్లో నీ రూపాన్ని ఊహించుకుని ప్రేమిస్తున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే. Be My Valentine Forever.

Tags

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×