BigTV English

Valentine History : వాలంటైన్ డే చరిత్ర ఇదీ..!

Valentine History : వాలంటైన్ డే చరిత్ర ఇదీ..!
History Of Valentine's Day

History Of Valentines Day : మూడవ శతాబ్దంలో రోమ్ నగరంలో వాలంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ఆ కాలంలో నాటి రోమ్ పాలకుడైన రెండో క్లాడియస్.. రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించాడు. ప్రేమ, పెళ్లి అంటూ పురుషులు ఇంటిపట్టునే ఉంటే యుద్ధం ఎవరు చేస్తారనేది ఆయన అభిప్రాయం.


రాజు మాట నచ్చని వాలంటైన్ రాజ్యంలో ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేయించేవాడు. ఇది తెలిసిన రాజు అతడిని బంధించి మరణ శిక్ష విధించాడు. శిక్షకు ముందురోజు సాయంత్రం జైలులో కనిపించిన అంధురాలై జైలరు కూతురితో సన్యాసి అయిన వాలంటైన్ తొలిసారి ప్రేమలో పడ్డాడు. ‘ఫ్రమ్ యువర్ వాలంటైన్’ అనే సందేశాన్ని ఆమెకు లేఖరూపంలో రాసి ఇచ్చాడట.

అంతేకాదు.. తన మహిమతో ఆమెకు చూపునూ ప్రసాదించాడని చెబుతారు. ఆ మరునాడే.. అంటే క్రీ.శ 269 లో ఫిబ్రవరి 14న అతడికి మరణశిక్షను అమలు చేశారు. ఆ తర్వాతి కాలంలో రోమన్లు వసంతకాలంలో లూపర్‌కాలియా అనే ఓ వేడుక చేసుకునేవారు. ఇందులో యువతీయువకులు ఓ డబ్బాలో అమ్మాయిల పేర్లన్నీ రాసి వేసి, ఒక్కో అబ్బాయి వచ్చి వాటిని తీసేవారు. ఇద్దరికీ ఇష్టమైతే ప్రేమ, కుదిరితే పెళ్లి కూడా చేసుకునేవారు.


అయితే.. ఈ రోమన్ వేడుకను క్రైస్తవ సంప్రదాయంగా మార్చాలని వాటికన్ భావించింది. సెయింట్ వాలంటైన్ బలిదానానికి గుర్తుగా క్రీ.శ 496లో నాటి పోప్ గెలాసియస్ దీనిని ప్రకటించిన తర్వాత ఇది విశ్వవ్యాప్త వేడుక అయింది. క్రీ. శ 1300 నాటికి ఈ రోజును అధికారిక సెలవుగా రోమన్లు ప్రకటించారు. యువతీయువకులు ఏకాంతంగా గడిపేలా ప్రోత్సహించారు.

1415లో ఫ్రెంచ్ డ్యూక్ ఛార్లెస్.. జైలులో ఉన్న తన భార్యకు “నాకు ప్రేమ జబ్బు సోకింది.. నా అందాల ప్రేయసి” అని ఆ తొలి గ్రీటింగ్ కార్డుపై రాశాడు. 17వ శతాబ్దంలో ప్రేమికుల రోజున ఎర్రగులాబీ ఇవ్వటం మొదలైంది. 1840 తర్వాత లేఖల స్థానంలో వాలెంటైన్ కార్డులు వచ్చాయి. ఈ మార్పుకు కారణమైన ఎస్తేర్ హోలాండ్‌ని ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలెంటైన్’ అని పిలిచారు.

ఇతర విశేషాలు
ఇక.. వాలంటైన్ డే రోజునే చరిత్రలో గొప్ప ఆవిష్కరణలు ప్రపంచం ముందుకొచ్చాయి. 1876 ఫిబ్రవరి 14 రోజునే అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను కనిపెట్టిన టెలిఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. 1929లో ఇదే రోజున ప్రపంచపు తొలి యాంటీ బయోటిక్ పెన్సిలిన్‌ని అలెగ్జాండర్ ప్లెమింగ్ ఆవిష్కరించారు.

ప్రపంచవ్యాప్తంగా యువత అంతా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటుంటే.. పాకిస్థాన్, మలేసియా, సౌదీ అరేబియా, ఇండోనేసియా, కిర్గిస్థాన్,ఇరాన్ దేశాలు మతపరమైన కారణాల వల్ల దీనిని నిషేధించాయి. ముఖ్యంగా ప్రేమికుల రోజున సౌదీ అరేబియాలో ఎర్రగులాబీ పట్టుకొని రోడ్డుమీద కనిపిస్తే చాలు.. జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.

మరో వైపు భారత ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’గా ప్రకటించింది. ఈ మేరకు పశుసంవర్ధక,ఫిషరీస్, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు చెబుతున్న ప్రకారం.. మన దేశ ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యానికి మూలమైన ఆవుకు ఈ రోజున గౌరవం ఇద్దామని పిలుపునిచ్చింది.

అలాగే.. వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుల్లో ఎక్కువ మంది చూసే మోస్ట్ పాపులర్ హర్రర్ సినిమాగా 1981 నాటి My Bloody Valentine రికార్డులకెక్కగా, అమెరికాలో వాలంటైన్ పేరుతో.. అరిజోనా, నెబ్రాస్కా, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో 4 నగరాలున్నాయి.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×