BigTV English
Advertisement

Makeup Tips: పండగ పూట అందంగా కనిపించాలా ? ఇలా సింపుల్ మేకప్ వేసుకోండి

Makeup Tips: పండగ పూట అందంగా కనిపించాలా ? ఇలా సింపుల్ మేకప్ వేసుకోండి

Makeup Tips: ప్రతి పండుగలాగే దీపావళి రోజు కూడా మహిళలు అందంగా కనిపించాలని కోరుకుంటారు. మహిళలు అందంగా కనిపించడానికి తరుచుగా పార్లర్‌లకు వెళుతుంటారు. మీరు మీ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలనుకుంటే, మీరు పార్లర్‌కు వెళ్లే బదులు, కొన్ని సులభమైన బ్యూటీ చిట్కాలను పాటించడం ద్వారా పార్లర్ లాంటి మేకప్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫేస్ క్లీనింగ్ :

ఏ మేకప్‌ చేయడానికైనా ముందు ముఖాన్ని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ముందుగా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తద్వారా మీ ముఖంపై చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. దీని తర్వాత, చర్మంపై ఉన్న మురికి, నూనె పూర్తిగా తొలగిపోయేలా టోనర్ ఉపయోగించండి. ఇది మేకప్ కోసం మీ ముఖాన్ని సిద్ధం చేస్తుంది.


మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు :

ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత, దానిని తేమ చేయడం మర్చిపోవద్దు. మాయిశ్చరైజర్ మీ చర్మానికి తేమను అందిస్తుంది మరియు దానిని మృదువుగా మరియు హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వల్ల మేకప్ ఎక్కువసేపు ఉంటుంది మరియు మీ ముఖం తాజాగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ప్రైమర్ ఉపయోగించడం చాలా ముఖ్యం :

మేకప్‌లో ప్రైమర్ ఒక ముఖ్యమైన భాగం. ఇది మీ మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. అలాగే, ప్రైమర్ కారణంగా, ఫౌండేషన్, ఇతర మేకప్ మీ చర్మంపై నిలిచి ఉంటాయి.

ఫౌండేషన్, కన్సీలర్ వాడకం:

ఫౌండేషన్, కన్సీలర్ మీ ముఖాన్ని సహజంగా కనిపించేలా చేస్తాయి. ఫౌండేషన్ యొక్క రంగు మీ చర్మం రంగుకు సరిపోయేలా చూసుకోండి. ఫౌండేషన్‌ను బాగా బ్లెండ్ చేయండి. ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు ఉంటే, అప్పుడు కన్సీలర్ ఉపయోగించండి. మీ ముఖం సహజంగా కనిపించేలా ఫౌండేషన్‌ను అప్లై చేయండి.

Also Read: పసుపులో ఇవి కలిపి ముఖానికి అప్లై చేస్తే.. అందం రెట్టింపు

ఐ మేకప్ సరిగ్గా చేయండి:

ఐ మేకప్ మీ ముఖానికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ముందుగా మీ కనుబొమ్మలకు ఐలైనర్ అప్లై చేయండి. తర్వాత ఐ షాడో ఉపయోగించండి. పండుగ సీజన్ కోసం మెరిసే లేదా నిగనిగలాడే ఐ షాడోలను ఎంచుకోండి. దీని ద్వారా మీ కళ్ళు మరింత అందంగా, పెద్దగా కనిపిస్తాయి. కంటి అందం కోసం ఐలైనర్, మస్కరా ఉపయోగించండి.

మీ లెహంగా లేదా చీరకు సరిపోయే లిప్‌స్టిక్‌ను ఉపయోగించండ:

లిప్‌స్టిక్ మీ మొత్తం మేకప్‌ను హైలెట్ చేస్తుంది. దీపావళి సందర్భంగా, మీరు ఎరుపు, మెరూన్ లేదా గులాబీ వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోవచ్చు. మీకు లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలనుకుంటే, ముందుగా లిప్ లైనర్‌తో మీ పెదాలను హైలెట్ చేయండి. ఆపై లిప్‌స్టిక్‌ను అప్లై చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×