BigTV English
Advertisement

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి ముందు డేటింగ్ కు వెళ్లి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. ప్రేమకు ముందు చేసే పనే డేటింగ్. అయితే ఇందులో కొత్త పద్ధతి అమల్లోకి వచ్చింది. అదే మాస్టర్ డేటింగ్. ఈ డేటింగ్ లో మీరు ఉంటే చాలు, భాగస్వామితో పనిలేదు. ఒంటరిగానే మీరు ఆనందంగా ఉండవచ్చు. నచ్చిన చోటకి వెళ్లి నచ్చిన పని చేయవచ్చు. నచ్చింది తినవచ్చు. మీ ప్రేమను మీరే పూర్తిగా మీకు పంచుకోవచ్చు. ఈ రోజుల్లో మాస్టర్ డేటింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.


ఇదే సోలో డేటింగ్
మాస్టర్ డేటింగ్ అనేది మీపై మీకు ప్రేమను నమ్మకాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసంతో జీవితంలో అడుగుపెట్టేలా పాజిటివిటీని పెంచుతుంది. దీన్ని సోలో డేటింగ్ అని కూడా అనుకోవచ్చు. వీలైతే మీరు మాస్టర్ డేటింగ్ కు వెళ్లేందుకు ప్రయత్నించండి.

మాస్టర్ డేటింగ్ ఉపయోగాలు
చాలామందికి జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. ప్రేమలో విఫలమవడం, భాగస్వామి చేతిలో మోసపోవడం, భర్త లేదా భార్య నుంచి వేధింపులకు గురికావడం వంటివి. వారంతా ఎంతో కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోవలసిన అవసరం లేకుండా మాస్టర్ డేటింగ్‌ను మొదలుపెట్టండి. ఈ క్రమంలో మీకు జీవితంపై ఆశపడుతుంది. మీపై మీరే ప్రేమను పెంచుకుంటారు. నెగెటివిటీని వదిలేస్తారు. పాజిటివిటీ వైపుగా ప్రయాణం మొదలుపెడతారు.


మీ జీవితం మీ చేతిలో ఉంటుంది. ఈ సోలో డేటింగ్ ట్రెండ్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇతరులతో డేటింగ్‌కు వెళితే వారికి నచ్చినట్టుగా జీవించాల్సి రావచ్చు. వారికి నచ్చింది తినాల్సి రావచ్చు. కానీ మాస్టర్ డేటింగ్ లో మీకు మీరే భాగస్వామి, మీకు నచ్చిన పని చేయవచ్చు. మీకు నచ్చినది తినవచ్చు. ట్రెక్కింగ్, హైకింగ్ ఇలాంటి సాహసాలు ఏది కావాలంటే అది చేయవచ్చు. దీనికోసం మీరు ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడకు వెళ్లి మీరు ఒంటరిగానే ఎంజాయ్ చేయాలి.

మాస్టర్ డేటింగ్ లో డాన్స్‌కు, పాటలకు ప్రముఖ పాత్ర ఉంటుంది. మీ ఫోన్లో మీరే పాటలు వింటూ ఆనందంగా డాన్స్ చేసుకోవాలి. అలాగే సంగీత కచేరీలకు వెళ్లి ఎంజాయ్ చేయాలి. మీకు నచ్చిన సినిమాని ఇంట్లోనే పెట్టుకుని థియేటర్ ఫీల్ లాగా పాప్ కార్న్‌ను తింటూ ఆనందపడాలి. షాపింగ్ మీకు ఇష్టమైతే సోలోగానే షాపింగ్‌కి వెళ్ళండి. ఇతరులు సలహాల అవసరం లేకుండా మీకు నచ్చిన డ్రెస్‌ని మీరు ఎంచుకోవచ్చు. ఎవరి అభిప్రాయాలతో మీకు పని లేదు, మీకు మీరే ముఖ్యమని చెప్పడమే ఈ మాస్టర్ డేటింగ్ ముఖ్య ఉద్దేశం.

Also Read: ముందు ప్రేమ.. ఆ తర్వాత ఇంకేముంది అదే.. పెరుగుతున్న లవ్ బ్రేకప్స్.. కారణం అదేనా?

బిజీ లైఫ్ స్టైల్‌లో పడి మీ గురించి మీరు పట్టించుకోవడమే మానేస్తున్నారు. అందుకే ఇతరులు మీ జీవితాల్లోకి చొచ్చుకొచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్టర్ డేటింగ్‌ను ఈరోజే ప్రారంభించండి. మీ జీవితంలో ఆనంద క్షణాలు ఎన్నో అడుగు పెడతాయి. కేవలం ఒంటరి వారికే కాదు, పెళ్లయిన వారికి కూడా మాస్టర్ డేటింగ్ ఎంతో అవసరం. అప్పుడప్పుడు మాస్టర్ డేటింగ్ చేస్తూ ఉండండి.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×