BigTV English
Advertisement

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి
మరణాలపై ఇంతవరకూ రాని స్పష్టత
రంగంలోకి దిగిన ఇద్దరు మంత్రులు
జిల్లా అధికారులతో నారాయణ సమీక్ష
బోరు నీటిని ల్యాబ్‌కు పంపాలని ఆదేశాలు
మెడికల్ క్యాంపులు పెంచాలన్న గొట్టిపాటి


పల్నాడు, స్వేచ్ఛ:
Diarrhoea Cases Palnadu: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఇద్దరు వ్యక్తులు వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో దాచేపల్లి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా గజపతినగరంలో డయేరియాతో పలువురు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దాచేపల్లి మరణాలపై ఆరా తీసిన ప్రభుత్వం ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపింది. జిల్లా అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే నీరు కలుషితం కావడంతో చనిపోయారా? లేక వేరే కారణాలున్నాయా? అనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో స్థానికంగా ఉన్న బోర్లు అన్నింటినీ మూసివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వెంటనే ఆ బోర్లలో నీటిని పరీక్షల కోసం విజయవాడ ల్యాబ్‌కు పంపాలని మంత్రి సూచించారు. సాధారణ పరిస్ధితి వచ్చే వరకూ మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలన్నారు.

Also Read: Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు


అవగాహన కల్పించండి..
ఈ ఘటనపై ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. పల్నాడు కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. డయేరియా లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. మెడికల్ క్యాంపుల సంఖ్య పెంచాలని మంత్రి సూచించారు. సంబంధిత ప్రాంతాల్లో బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డయేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ను గొట్టిపాటి సూచించారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×