పిల్లలు పుట్టకపోతే ఆ తప్పును ఆడవారి మీద వేసే సమాజం ఇంకా ఉంది. అయితే చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా మగవారికి కారణంగా కూడా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. నిజానికి ఇవన్నీ కూడా పురుషులపై సంతానోత్పత్తి పైనే ప్రత్యక్ష ప్రభావాన్ని నేరుగా చూపిస్తాయి. పిల్లలు కనాలనుకునే మగవారు ముందు నుంచే ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజువారీగా వారు చేసే కొన్ని పనులు వారికి తండ్రి అయ్యే అవకాశాన్ని దూరం చేస్తాయి.
కొన్ని రకాల చెడు అలవాట్లు పురుషులలో స్పెర్మ్ కౌంటును తగ్గిస్తాయి. అలాగే వీర్య నాణ్యతను, టెస్టోస్టెరాన్స్ స్థాయిలను కూడా దెబ్బతీస్తాయి. ఇది సంతానోత్పత్తి పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ కింద చెప్పిన అలవాట్లు మీకుంటే వెంటనే వదిలిపెట్టండి.
బిగుతైన దుస్తులు వద్దు
ఏ కాలంలోనైనా బిగుతుగా ఉండే లోదుస్తులను వేసుకోకూడదు. ఇది నేరుగా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. పురుషుల శరీర ఉష్ణోగ్రత అనేది సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని దిగువ భాగంలో ఉండే ఉష్ణోగ్రత సమంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించడం వల్ల అలాగే లాప్‌టాప్ ను ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని పనిచేయడం వల్ల, వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని దిగువభాగంలో ఉష్ణోగ్రత తిరిగిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇది పిల్లలు కలగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మగవారు వదులుగా ఉండే లోదుస్తులను వేసుకోవాలి. అలాగే శరీరం దిగువ భాగానికి గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి.
సరైన నిద్ర లేక
పురుషుల్లో ఎంతోమంది అర్ధరాత్రి వరకు సినిమాలు షికార్లు చేసే అలవాట్లు ఉంటాయి. నిజానికి అలాంటి అలవాటు వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం అనేది పురుషులలో హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ఇది హార్మోన్ అసమతుల్యతకు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనివల్ల వీర్యకణాల స్థాయిలు తగ్గిపోతాయి. స్పెర్మ్ ఉత్పత్తి మందగిస్తుంది. అప్పుడు పిల్లల పుట్టడం కష్టంగా మారుతుంది.
మద్యపానం
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా వెంటనే వాటిని వదిలేయాలి. ఈ రెండూ కూడా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని విపరీతంగా తగ్గిస్తాయి. సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది. అంతేకాదు ఇతర హానికరమైన రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి వీర్యకణాల చలనశీలతను, వాటి సంఖ్యను, నాణ్యతను తగ్గిస్తాయి. మద్యం తాగడం వల్ల టెస్టెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి.
జంక్ ఫుడ్ అధికంగా తిన్న
మహిళలతో పోలిస్తే పురుషలే అధికంగా జంక్ ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఇది వారి పోషకాహార లోపానికి కారణం అవుతుంది. జంక్ ఫుడ్ నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినే పురుషుల్లో సంతానోత్పత్తిపై చెడు ప్రభావం పడుతుంది.
ప్రతిరోజూ వ్యాయామం, నడక వంటివి చేయాలి. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు వంటివి అధికంగా తినాలి. కంటి నిండా నిద్రపోవాలి.