Ahmedabad Plane Crash| అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 దుర్ఘటనలో 265 మంది మరణించగా.. ఒక్క వ్యక్తి మాత్రమే ఊహించని విధంగా బతికి బయటపడ్డాడు. బ్రిటిష్ జాతీయుడైన విశ్వాస్ కుమార్ రమేష్, ఎయిర్ ఇండియా విమానంలో 11A సీటులో, ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కింద పడి రెండు ముక్కలుగా విడిపోయిందని చెప్పాడు. ఆ తరువాత తాను ఊహించనిరీతిలో బయటపడ్డానని.. తాను విమానం నుంచి దూకలేదని తెలిపాడు.
డాక్టర్లతో రమేష్ మాట్లాడుతూ.. తాను విమానం నుంచి దూకలేదని.. విమానం విడిపోయినప్పుడు సీటు బెల్ట్ వేసుకున్నా సీటుతో సహా.. బయటకు విసిరివేయబడ్డానని తెలిపాడు. దీంతో.. విమానాన్ని మంటలు చుట్టుముట్టినప్పుడు అతను సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలతో కనిపించిన అతను ప్రస్తుతం ట్రామా వార్డులో చికిత్స పొందుతున్నాడు. రమేష్ గాయాలతో, రక్తం కారుతూ ఆస్పత్రి వైపు నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడిని చూసిన వారు విమానంలోని ఇతరుల గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం రమేష్ పరిస్థితి నిలకడగా ఉందని.. అతనికి తీవ్ర గాయాలేమీ
ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం.. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన అయితు నిమిషాల వ్యవధిలోనే ఈ విమానం సమీపంలోని జనావాసంలో కూలిపోయింది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపడింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. రమేష్ మినహా అందరూ మరణించారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది.
గత 11 సంవత్సరాల పాటు సర్వీసులో ఉన్నఈ పాత విమానం టేకాఫ్ అయిన తర్వాత 600-800 అడుగుల ఎత్తు వరకు ఎగిరి, వెంటనే కూలిపోయింది. దూరం నుంచి చూస్తే, విమానం వేగంగా దిగుతూ, మంటల్లో చిక్కుకొని దట్టమైన నల్లని పొగను వదిలింది. దుర్ఘటన తర్వాత విమాన భాగాలు మెడికల్ కాలేజీ భవనంలో చిక్కుకున్నాయి. ల్యాండింగ్ గేర్, ఫ్యూజ్‌లేజ్, టెయిల్ భాగాలు బిల్డింగ్ గోడల్లో చిక్కుకొని ఉన్న దృశ్యాలు కనిపించాయి.
టేకాఫ్ అయిన వెంటనే.. మధ్యాహ్నం 1:39 గంటలకు పైలట్ ‘మేడే’ అనే అత్యవసర సంకేతాన్ని పంపాడని అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. ఈ దుర్ఘటనపై అధికారిక విచారణ ప్రారంభమైంది. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్—ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ల కోసం అధికారులు సిబ్బందితో కలిసి గాలిస్తున్నారు. ఈ రికార్డర్‌లలో ఫ్లైట్ చివరి క్షణాల్లో జరిగిన విషయాలను వెల్లడిస్తాయి.
ఎయిర్ ఇండియా ప్రకారం.. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ప్రయాణికులు ఉన్నారు. మిగిలిన 12 మందిలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నారు. రమేష్ తప్ప వీరంతా ఈ ప్రమాదంలో మరణించారు.
Also Read: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్
ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రజలు షాక్ కు గురయ్యారు. బతికి బయటపడిన రమేష్‌ను చూసిన వారు అతడి అదృష్టాన్ని గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అధికారులు ఈ దుర్ఘటనకు గత కారణాలను కనుగొనేందుకు లోతైన విచారణ చేస్తున్నారు.