Morning Skin Care Routine: మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన, అందమైన చర్మం యొక్క రహస్యం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉండదు. సరైన అలవాట్లలో కూడా దాగి ఉంటుంది.
మీరు రోజు ప్రారంభంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు.. మాత్రమే అది మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రతి రోజు ముఖం తాజాగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి:
ఉదయం నిద్రలేచిన తర్వాత మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మురికి , ధూళిని తొలగించడమే కాకుండా చర్మ రంధ్రాలను కూడా తెరుస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా చేస్తుంది. ముఖంపై మురికి తొలగిపోవాలంటే మంచి ఫేస్ వాష్ ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతూ శుభ్రపరుస్తుంది.
టోనర్ వాడండి:
టోనర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. టోనింగ్ ప్రక్రియ చర్మ రంధ్రాలను కుదించి, మృదువైన, స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది. టోనర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
మాయిశ్చరైజర్ రాయండి:
మాయిశ్చరైజర్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. డ్రై స్కిన్ సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. పొడి గాలి, ఎండ నుండి రక్షించడానికి ప్రతి సీజన్‌లో మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. మంచి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది మరింత ప్రకాశవంతంగా ఉంటుంది.
సన్‌స్క్రీన్ :
సన్‌స్క్రీన్ వాడటం చర్మానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది సూర్యుడి హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది. సూర్య కిరణాలు చర్మం వృద్ధాప్యానికి కారణమవుతాయి. అంతే కాకుండా ఇది ముడతలు, పిగ్మెంటేషన్, ఇతర సమస్యలకు దారితీస్తాయి. పగటిపూట బయటకు వెళ్ళేటప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని రక్షించి, మెరుస్తూ ఉంటుంది.
Also Read: ఒత్తైన జుట్టు కోసం.. కొరియన్స్ ఏం చేస్తారో తెలుసా ?
కంటి చుట్టూ క్రీమ్ రాయండి:
కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం కోసం ఐ క్రీమ్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ముడతలు , సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కళ్ళ కింద వాపు, నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది. తేలికపాటి చేతులతో దీన్ని అప్లై చేసి, చర్మంలోకి బాగా పీల్చుకునేలా సున్నితంగా మసాజ్ చేయండి.
సీరం:
ఉదయం పూట స్కిన్ కేర్‌లో సీరం వాడటం వల్ల చర్మానికి లోతైన పోషణ, హైడ్రేషన్ లభిస్తుంది. ఇది చర్మ సమస్యలను లక్ష్యంగా చేసుకుని ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది.