TG New Ministers Oath: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గ టీం 2.0 కొలువుదీరింది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నట్టు.. మక్తల్ ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫామ్ అయింది. ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి.
కొత్త మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఇటు రామచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామన్నారు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. సామాన్య కాంగ్రెస్ కార్యకర్త గా NSUI నుంచి రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. 32 లక్షల మంది 2011 జనాభా ప్రకారం మాదిగలు ఉన్నారు. మా న్యాయమైన సమస్య అధిష్టానం ముందు పెట్టాం. జనాభా ప్రకారం హక్కులు అని రాహుల్ గాంధీ అన్నట్లు న్యాయం చేశారు. ఇంతటి గౌరవం దక్కింది అంటే.. జాతీయ,రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అవకాశం అంటూ మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఆవేదన చెందారు. దాంతో సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సుదర్శన్‌రెడ్డిని కలిశారు. ఇటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: మాగంటిని చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్
మరోవైపు మంత్రి పదవి దక్కకపోవడంపై మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీకి లేఖ రాశారాయన. మంత్రి పదవి దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సాయంత్రం ఇదే విషయంపై మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నారు.