Best Budget Electric Scooter: భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై రోజురోజుకూ ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి ఆప్షన్స్ లో ఒకినావా డ్యూయల్ 100 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ భారత మార్కెట్లో రూ.1.19 లక్షల ప్రారంభ ధరతో అందిస్తోంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి రేంజ్, అదిరిపోయే ఫీచర్లతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఒకినావా డ్యూయల్ 100లో 3.12 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బ్యాటరీతో స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 129 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఈ రేంజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారికి ఈ స్కూటర్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. రాత్రి సమయంలో ఛార్జింగ్‌కు పెట్టి, ఉదయం పూర్తిగా ఛార్జ్ అయిన స్కూటర్ ను ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉండటం కూడా ఈ స్కూటర్ కు మరో అడ్వంటేజ్ గా చెప్పుకోవచ్చు.
ఒకినావా డ్యూయల్ 100లో కంపెనీ E-ABS ఫీచర్‌ను అందించింది. ఇది ఎమర్జెన్సీ బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో వెహికల్ కంట్రోల్ మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా తడి రోడ్లు, జారుడు పరిస్థితుల్లో ఈ సిస్టమ్ రైడర్‌కు అదనపు భద్రతను అందిస్తుంది. దీంతో స్కూటర్ ను మరింత సేఫ్ గా నడిపే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి రేంజ్, ఈజీ ఛార్జింగ్ సౌకర్యం కారణంగా రోజువారీ అవసరాలకు బాగా సరిపోతుంది. పెట్రోల్ ఖర్చులను తగ్గించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే, మంచి రేంజ్, అత్యాధునిక ఫీచర్లు, సరసమైన ధరతో ఒకినావా డ్యూయల్ 100 భారతీయ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా నిలుస్తోంది.
Read Also: అడ్వెంచర్ స్టైల్ తో హోండా ADV 160.. ఈ 5 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!