ICC Rules: క్రికెట్….మన దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడతారు అదే సమయంలో చూస్తారు. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెట్ ఎక్కువ చూసేందుకే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లాంటి చిన్నచిన్న లీగ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. అయితే క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఐసీసీ కూడా… రకరకాల కొత్త రూల్స్ తీసుకువచ్చి క్రికెట్ కు మంచి ఊపు తెప్పిస్తోంది.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
నిబంధనలు పెట్టడం అలాగే కొత్త రూల్స్ తీసుకురావడం.. ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అందరికీ ఆసక్తి పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్లో మరో రెండు కొత్త రూల్స్ జోడించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపింది. కొత్తగా రాబోతున్న ఈ రెండు క్రికెట్ రూల్స్ జూన్ 17వ తేదీ నుంచి అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ లో రెండు కొత్త రూల్స్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో రెండు సరికొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. గత నెల కింద ప్రపోజల్స్ రాగా… ఈ రూల్స్ ను తాజాగా ఆమోదించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇక నుంచి వన్డేలలో రెండు కొత్త బంతులను 34వ ఓవర్ వరకే ఉపయోగించాలని… కొత్త రూల్స్ తీసుకువచ్చింది. బౌలింగ్ టీం వాటిలో ఒకటి ఎంచుకొని మిగతా 16 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 25 ఓవర్లకే మ్యాచ్ కుదిస్తే కొత్త బంతిని ఇన్నింగ్స్ మొత్తం వినియోగించుకోవాలి. ఇలా రెండు కొత్త బంతులను 34 వ ఓవర్ వరకు వినియోగిస్తే బౌలర్ కు చాలా మేలు జరుగుతుంది. దానివల్ల బౌలర్ కు మంచి గ్రిప్ దొరుకుతుంది. దీంతో వికెట్లు తొందరగా తీయవచ్చు. బౌలర్ అనుకున్న… రీతిలో బౌలింగ్ చేసి… బ్యాటర్ను ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకువచ్చిన రూల్ బౌలర్లకు అనుకూలించనుంది.
కంకషన్ సబ్ స్టిట్యూట్ పై కీలక నిర్ణయం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కంకషన్ సబ్ స్టిట్యూట్ పై కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంకషన్ సబ్ స్టిట్యూట్ కోసం వికెట్ కీపర్, బ్యాటర్, సీమర్, స్పిన్ బౌల్లెర్స్ అలాగే ఆల్రౌండర్ పేర్లను ఒక్కటి చొప్పున మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్స్ జూన్ 17వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నట్లు తెలిపింది. అటు బౌండరీ లైన్ బయటకు వెళ్లి రెండు సార్లు బంతిని పుష్ చేస్తూ పట్టే.. హాఫ్ క్యాచులు ఇక నుంచి చెల్లబోవు అని.. నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
🚨 TWO BIG CHANGES IN CRICKET FROM JUNE 17 🚨
– Two new balls will be only used till the 34th over then the bowling team can choose from one ball from that and complete the rest of 16 overs that ball in ODIs.
– Teams need to submit 1 WK, 1 Batter, 1 Seam bowler, 1 spinner, 1… pic.twitter.com/oIhLuwBoqc
— Johns. (@CricCrazyJohns) June 15, 2025