BigTV English

Instant Facial: పది నిమిషాల్లో.. మెరిసే చర్మం మీ సొంతం

Instant Facial: పది నిమిషాల్లో.. మెరిసే చర్మం మీ సొంతం

Instant Facial: సాధారణంగా ఫంక్షన్స్ అన్ని.. సాయంత్రం సమయంలో జరుగుతూ ఉంటాయి. పగలంతా ఇంట్లో కష్టపడుతుంటారు. ఉద్యోగ వ్యాపారాలు చేసుకొని వస్తుంటారు. ఇక బయట బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఫేసియల్స్ చేపించే టైమ్ కూడా ఉండదు చాలామందికి.. మరి ఫంక్షన్స్‌కి వెళ్లేటప్పుడు ఫేస్‌పై డల్ నెస్ అంతాపోయి.. కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చాలా అందంగా కనిపిస్తారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్-1
ముందుగా చిన్న టమాటో గుజ్జు తీసుకుని.. అందులో టీ స్పూన్ షుగర్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్, మృత కణాలు తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది.

స్టెప్-2
క్యాబేజీ ఆకులతో ముఖంపై కాసేపు.. సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఫేస్ చాలా స్పూత్‌గా మారడంతో పాటు.. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.


స్టెప్ -3
అరటిపండు తొక్కతో.. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై డల్ నెస్ తొలగిపోయి, తాజాగా మెరిసేలా చేస్తుంది.

స్టెప్-4
చిన్నబౌల్ తీసుకుని అందులో బొప్పాయి గుజ్జు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖం చాలా గ్లో గా, కాంతివంతంగా మెరుస్తుంది.

ముఖం కాంతివంతంగా, మెరిసిపోవాలంటే.. ఈ చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. 

శెనగపిండి, రోజ్ వాటర్, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, రోజ్ వాటర్, పసుపు వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఫంక్షన్స్‌కు వెళ్లే ముందు చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా, స్కిన్ గ్లో గా ఉంటుంది. ఫేస్‌పై డల్ నెస్ తగ్గిపోయి చాలా అందంగా కనిపిస్తారు.

ముల్తానీ మిట్టి, పాలు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో ముల్తానీ మిట్టి, పాలు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖం తాజాగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

బియ్యంపిండి, పాలు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, రోజ్ వాటర్, పాలు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. ముఖానికి పెట్టుకుని 15 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా మెరిపోవడంతో పాటు.. చాలా అందంగా కనిపిస్తారు.

Also Read: ఒక్కసారి ఇలా చేస్తే.. క్షణాల్లో అద్భుతమైన మెరుపు మీ సొంతం

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×