Mango Leaves For Hair: జుట్టు పొడవుగా, మందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత మన జీవన విధానంతో పాటు తినే ఆహారం, కాలుష్యం, అనారోగ్య కారణాల వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని హోం రెమెడీస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని వాడటం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది. హోం రెమెడీస్ లో మామిడి ఆకులు కూడా ఒకటి.
మామిడి ఆకులు మన జుట్టుకు ఇంత ఉపయోగకరంగా ఉంటాయో మీరు ఊహించి ఉండరు. నిజానికి.. వీటిలో విటమిన్ ఎ, సి, బితో పాటు అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో.. అంతే కాకుండా జుట్టు రాలకుండా నిరోధించడంలో , జుట్టుకు తిరిగి కొత్త మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి. ఇంతకీ మామిడి ఆకులను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలి ?
మామిడి ఆకులను జుట్టు పెరుగుదలకు ఉపయోగించడం చాలా సులభం.
మామిడి ఆకులతో హెయిర్ మాస్క్:
కావాల్సినవి:
తాజా మామిడి ఆకులు- 10 నుంచి 15
నీరు- 1 కప్పు
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె-1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా మామిడి ఆకులను బాగా కడగాలి. తర్వాత మామిడి ఆకులను మిక్సీలో వేసి కొంచెం నీరు కలిపి మందపాటి పేస్ట్ లా చేయండి.
మీకు కావాలంటే,..మీరు ఈ పేస్ట్‌కు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను కూడా కలుపుకోవచ్చు. అనంతరం ఈ పేస్ట్ ని మీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో వాష్ చేయండి. వారానికి 1-2 సార్లు ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
మామిడి ఆకుల నీరు:
మీ జుట్టుకు తగిన పోషణను అందించడానికి ఇది మంచి మార్గం
కావాల్సినవి:
తాజా మామిడి ఆకులు- సుమారు 15-20
నీరు- 2-3 కప్పులు
తయారీ విధానం:
ఒక పాత్రలో కప్పు నీళ్లు..ముందుగా తీసుకున్న మామిడి ఆకులు వేయండి.
ఆకుల రంగు మారే వరకు, నీరు కొద్దిగా తగ్గే వరకు గ్యాస్ పై నీటిని మరిగించండి.
నీరు చల్లారనివ్వండి. తరువాత ఆకులను వడకట్టి వేరు చేయండి.
మీ జుట్టును షాంపూతో వాష్ చేసిన తర్వాత.. ఈ నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోండి. మామిడి నీరు వాడిన తర్వాత తలస్నానం చేయకూడదని గుర్తుంచుకోండి. ఇది మీ జుట్టును బలోపేతం చేయడానికి, మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది.
మామిడి ఆకు నూనె:
ఈ పద్ధతి జుట్టును ఎక్కువ కాలం దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
కావాల్సినవి:
ఎండిన మామిడి ఆకులు- 3 (లేదా ఎండబెట్టిన తాజా ఆకులు)
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె- చిన్న కప్పు
Also Read: 30 ఏళ్లు దాటినా కూడా యవ్వనంగా కనిపించాలా ?
తయారీ విధానం:
ఎండిన మామిడి ఆకులను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
ఒక పాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి.. ఈ ఆకులను అందులో వేయండి.
ఆకులు నల్లగా మారే వరకు, వాటి పోషకాలు నూనెలో కలిసిపోయే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
నూనెను చల్లబరిచి.. వడకట్టి, ఒక సీసాలో నిల్వ చేసుకోండి.
ఈ నూనెతో మీ జుట్టుకు వారానికి 2-3 సార్లు మసాజ్ చేయండి.
నూనె వాడిన 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.