ఒక వ్యక్తికి ప్రేమ, శ్రద్ధ చాలా అవసరం. ఎదుటి వ్యక్తిపై ప్రేమను, కేరింగ్‌ను చూపిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. భార్యాభర్తలు, ప్రేమికులు ఎవరైనా కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం, శ్రద్ధా వంటివి ఉండాలి. కానీ అవి మితిమీరితే మాత్రం జీవిత భాగస్వామి లో విపరీతమైన చిరాకును, కోపాన్ని పెంచుతాయి. కాబట్టి మీ అతి ప్రేమ, అతి కేరింగ్ వంటివి మానుకొని వారిని మీ బంధంలో ఉండేలా కాపాడుకోండి.
❤ చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందించడం, సొంతంగా ఏ పనులు చేయకుండా భాగస్వామిని అడ్డుకోవడం అన్నీ తానే చేసి పెట్టడం… ఇవన్నీ కూడా ఎదుటివారిలో విపరీతమైన కోపాన్ని, చికాకును విరక్తిని పెంచేస్తాయి. ఒక అనుబంధంలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉండాలి. కానీ ఊపిరాడకుండా బంధించిన ఫీలింగ్ రాకూడదు. మీరు కూడా అలాగే ఉంటే ఆ పద్ధతులని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
❤ స్వేచ్ఛను ఇవ్వండి
మీ భాగస్వామికి వారికి కావలసిన స్వేచ్ఛను ఇవ్వండి. వారు ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే అవకాశాన్ని కల్పించండి. ప్రతిసారీ వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? వంటివి అడగడానికి ప్రయత్నించకండి. అలాగే వారికి ప్రతి విషయంలోని మార్గ నిర్దేశం చేయడానికి ప్రయత్నించండి. ఇది అతి ప్రవర్తన కింద వస్తుంది. తమ భాగస్వామిని జీవితంలోని ప్రతి అంశంలో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనివల్ల అవతలి వ్యక్తులు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్నట్టు భావిస్తారు. మీతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
❤ అతి ప్రేమ, మితిమీరిన కేరింగ్ మంచిది కాదు
కొంతమందిలో అతి ప్రేమ, అతి కేరింగ్ వంటివి ఉంటాయి. అలాంటివారే ఇలా ఎదుటి వ్యక్తిని నియంత్రించడానికి, ఊపిరాడకుండా సలహాలు, సూచనలు, ప్రేమను అందించడానికి ప్రయత్నిస్తారు. అధిక భద్రతను చూపించడం కంటే మీరు మీ భాగస్వామిని స్వేచ్ఛగా ఉంచడం మంచిది. మీరు అతికేరింగ్ అనుకుంటారు. కానీ మీ భాగస్వామి… తనపై నమ్మకం లేక ఇలా మీరు అడ్డువస్తున్నారని భావిస్తుంది. కాబట్టి పదే పదే వారి పనుల్లో వారి జీవితంలో అంతరాయం కలిగించకండి. ఇలా అయితే తగాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ భాగస్వామికి స్వేచ్ఛను వదిలేయండి. వారి సొంత వ్యక్తిగత సమయాన్ని వారికి ఇచ్చేయండి… తప్ప మితిమీరమైన జోక్యం వారికి మిమ్మల్ని దూరం చేస్తుంది.
❤ ఒక సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యం. మీ భాగస్వామిని ప్రతి క్షణం గమనించడం, వారి గురించి ఆరా తీయడం వంటివి మానేయండి. ప్రతి వ్యక్తికి ప్రైవసీ అవసరం. తన జీవితం గురించి ఆలోచించు కోవడానికి, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారికి ప్రైవసీ కావాలి. వారికి ఆ హక్కు కూడా ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామికి ఆ స్వేచ్ఛను ఇవ్వండి.
❤ మీరు వారి మీద చూపించే అతి ప్రేమ, అతి కేరింగ్ అనేవి బయటికి అభద్రతగా కనిపించవచ్చు. అంటే మీరు మీ భాగస్వామిని నమ్మడం లేదని వారు అర్థం చేసుకుని అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని అతిగా చేయకుండా కేవలం సాధారణ కమ్యూనికేషన్ ను మెయింటైన్ చేయండి.
❤ కేవలం భాగస్వామిని కాపాడుకోవడం భాగస్వామి ప్రేమలో మునిగి తేలడమే కాదు. మీ సొంత జీవితం పై కూడా దృష్టి పెట్టండి. మీకంటూ జీవితం లేకుండా ప్రేమలో మునిగిపోకండి. మీకు మీ అభిరుచులు, మీ స్నేహితులకు కూడా సమయం ఇవ్వండి. అది చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా అది ఎంతో మేలు చేస్తుంది.
Also Read: భార్య భర్తకు ఏ వైపున నిద్రపోవాలి? ఇలా నిద్రపోతే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది