E-Paper
Advertisement

నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే

నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే
Advertisement

Neelakurinji Flowers: ప్రకృతి రకరకాల వింతలు ఉంటాయి. చాలా వాటి గురించి మనకు తెలీదు. అలాంటివాటిలోని కేరళ నీలగిరి కొండల్లో అరుదైన పుష్పాలు. కేవలం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ పువ్వులు వికసిస్తాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఈ పువ్వులు పూసే సమయంలో అక్కడికి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అందంగా ఉందని పువ్వును కోస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష పడడం ఖాయం. ఇంతకీ దాని ప్రాముఖ్యత ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు

ప్రపంచంలో అత్యంత అరుదైనవి చూడటానికి ఎన్నో ఉన్నాయి. వాటిలో కేరళలోని నీలగిరి కొండలలో పెరిగే అందమైన పువ్వులు. వాటి అందాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు పర్యాటకులు. ఈ పువ్వు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. వీటిని నీలకురింజి పువ్వగా పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత అసాధారణమైన పువ్వుల్లో ఇది కూడా ఒకటి. నీలకురింజి పువ్వులు వికసించినప్పుడు నీలగిరి కొండలు అందాన్ని వర్ణించలేదు. ఆ కలర్‌తో దుప్పటి కప్పబడినట్లుగా కనిపిస్తుంది. దూరం నుంచి ఆ పర్వతాలను చూస్తే ముదురు ఆకుపచ్చ, నీలం రంగులో ఉన్నట్లు కనిపిస్తాయి. పువ్వులు వికసించిన తర్వాత ఊదా రంగులో కనిపిస్తుంది. అందంగా ఉందని వాటిని కోస్తే జైలుకు వెళ్ళడం ఖాయం.

12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పువ్వులు

Advertisement

నీలకురింజి పువ్వు 12 ఏళ్లకు ఒకసారి పూసే ఒక పొద. మొక్క పుట్టి పెద్దది కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మాత్రమే పువ్వు పూస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పువ్వుల్లో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. పూసిన తర్వాత ఈ మొక్క చనిపోతుంది. కొత్త విత్తనాలు మొలకెత్తి పువ్వు పూయడానికి మరో 12 సంవత్సరాలు పడుతుంది. 2006 ఏడాదిలో పువ్వుల సంరక్షణ కోసం కేరళలోని 32 చదరపు కిలోమీటర్ల అడవి కేటాయించారు. దీనికి కురింజిమల అభయారణ్యం అని పేరు పెట్టారు. ఈ అభయారణ్యం కురింజి ప్రచార మండలి కృషి ఫలితమే. దేశంలో ఇది రెండో పుష్ప అభయారణ్యం. పువ్వుకు సంబంధించి సుమారు 350 జాతులు కేవలం భారతదేశంలో కనిపిస్తాయి. కేరళలోని నడుకాని, గూడలూరు, ఊసిమలై, ఓ-లోయ వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. నీలకురింజి పువ్వు వికసించినప్పుడు లక్షలాది మంది పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు వాటిని తమ కెమెరాలు, మనసుల్లో బంధించేందుకు పోటీపడతారు. చాలా వారాల పాటు ఆ పువ్వులు వికసిస్తూ, ప్రకృతి సౌందర్యంతోపాటు టూరిస్టులను ఆకట్టుకుంటాయి.

అందంగా ఉందని కోస్తే జైలుకే, అక్కడి తెగకు అదొక అదృష్టం

దేశం నుంచి కాకుండా విదేశాల నుండి చూడటానికి వస్తుంటారు. కేరళ అటవీ శాఖ వీటిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కేరళలోని స్థానికులు ఈ పువ్వును ప్రేమ- శృంగారానికి చిహ్నంగా భావిస్తారు. అత్యంత అరుదైన పువ్వు కావడంతో కోయడం, ఏ విధంగానైనా దెబ్బతీయడం జరిగితే నేరుగా జైలు శిక్ష పడడం ఖాయం. జరిమానా విధించబడుతుంది. 2023లో అటవీ-వాతావరణ శాఖ.. నీలకురింజిని 1972 నాటి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్-III లో చేర్చింది. ఈ పువ్వుకు చట్టపరమైన రక్షణ కూడా ఉంది. ఈ పువ్వును కోస్తే రూ. 25 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. నీలకురింజి పూసే ప్రాంతాలకు వెళ్లవద్దని దాని ప్రాముఖ్యతను గౌరవించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నీలిరంగు పువ్వు కారణంగా ఆ ప్రాంతానికి నీలగిరి పేరు వచ్చిందని చెబుతుంటారు.

Advertisement

ALSO READ: రెబెల్స్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తలవంచరు

నీలగిరి పర్వత ప్రాంతాలకు చెందిన తోడా గిరిజనులు, నీలకురింజి పువ్వు వికసించడం శ్రేయస్సును, అదృష్టాన్ని తెస్తుందని నమ్మి, దానిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ పువ్వులు వికసించగానే, కొండలు పండుగ వాతావరణంతో కళకళలాడతాయి, పర్యాటకులను, స్థానికులను ఒకేలా ఆకర్షిస్తాయి. నీలగిరి పర్వత ప్రాంతాలకు చెందిన తోడా గిరిజనులు ఆ పువ్వులను అదృష్టంగా భావిస్తుంటారు. నీలకురింజి పువ్వు వికసించడం శ్రేయస్సును, అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం. అందుకే దాన్ని పవిత్రమైనదిగా వారు చెబుతారు. ఆ పువ్వులు వికసించగానే కొండల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది.

 

Related News

రెబెల్స్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తలవంచరు

భారతదేశంలోని ఈ రాష్ట్రం బ్రిటిష్ పాలనలో ఎప్పుడూ లేదు.. ఎందుకంటే

ఇండిపెండెన్స్ డే స్టైలింగ్ టిప్స్.. అమ్మాయిలు తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రెస్సింగ్ టిప్స్

ఆగస్టు 15న పిల్లలకు దేశభక్తి, క్యూట్ లుక్ ఇచ్చే డ్రెస్సింగ్ టిప్స్.. ఈజీగా ఇలా చేయండి

ఆగస్టు 15న ప్రధాని ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు.. ఎర్రకోటనే ఎందుకు?

మన జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. దేశభక్తిని చాటే అద్భుతమైన కోట్స్

Big Stories

Advertisement
×