Ninnu kori serial today Episode: అల్లుడి మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని నీలగిరి అడిగితే తెలియలేదు తెలిస్తే ముందు నీకే చెప్తానని దాక్షాయణి అంటే వాళ్లెవరో తెలిస్తే వాళ్ల కథ చెప్తాను అంటూ తిడుతుంటే.. గుడిలో నువ్వు ఏం చేశావో నేను చూశాను అంటూ దాక్షాయణి అనగానే.. నీలగిరి కంగారు పడుతూ నా చెల్లి చాలా తెలివైంది అన్ని ఇన్ని పట్టేస్తుంది అంటూ వెళ్లిపోతాడు.
చంద్ర వెళ్లి సామ్రాట్‌కు మెడిసిన్స్ ఇస్తుంది. టాబ్లెట్స్ వేసుకుంటూ ఇవి చాలా చేదుగా ఉన్నాయి అంటూ చెప్తుంటే.. అప్పుడే కేశవ వెళ్లి రైస్‌మిల్లులో పని వాళ్లకు జీతాలు ఇవ్వాలి ఈ ఫైలు చూసి సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పగానే.. తన సంతకం తనకు గుర్తు లేదని సామ్రాట్ చెబితే.. తెలుసురా అందుకే నువ్వు సైన్ చేసిన పాత చెక్ తీసుకొచ్చాను అది చూసి సంతకం ప్రాక్టీస్ చేసి తర్వాత చేయ్ అంటూ చెప్పి వెళ్లిపోతాడు. కేశవ వెళ్లిపోయాక ఆ ఫైల్ చూడటం నా వల్ల కాదు కానీ నువ్వు చూడు చంద్ర నేను సంతకం ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి సంతకం ప్రాక్టీస్ చేస్తూ.. అలవాటు లేని సామ్రాట్ అనే సంతకం ఈజీగా చేశాను. కానీ అలవాటైన విరాట్ అనే సంతకం చేయలేకపోతున్నాను.. అంటాడు. నువ్వు విరాట్ వే కదా బావ అని చంద్ర మనసులో అనుకుంటుంది.
ఫైల్ చూస్తూ.. బ్యాలన్స్ ట్యాలీ అవ్వడం లేదని రెండు లక్షల డిఫరెన్స్ వస్తుందని చెప్తుంది చంద్ర. అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటూ సామ్రాట్ అడిగితే.. అలా ఎలా జరుగుతుంది ఎవరు చేసి ఉంటారు అని సామ్రాట్ అడిగితే.. చంద్ర అంతా చూసి మీ సంతకం ఎవరో ఫోర్జరీ చేస్తున్నారు. మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా చెక్ పాస్ అయింది. బిల్స్ మీద మీ సంతకం ఉంది అంటూ చెప్తుంది. ఆ మాటలకు సామ్రాట్ షాక్ అవుతాడు. వెంటనే కేశవ దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. కేశవ మిల్లు మేనేజర్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. మేనేజరు వస్తాడు. మేనేజరుతో విషయం చెప్పి తిడుతుంటే.. ఆ ఫోర్జరీ చేసింది నేను కాదు మీ తమ్ముడు జీవన్ గారే అంటూ చెప్తాడు. సామ్రాట్ వెంటనే కోపంగా దాక్షాయణి, జీవన్‌లను పిలుస్తాడు.
అందరూ హాల్లోకి వస్తారు. సామ్రాట్ డైరెక్టుగా జీవన్ నా సైన్ ఫోర్జరీ చేశావా అంటూ నిలదీయగానే.. అందరూ షాక్ అవుతారు. దాక్షాయణి కోపంగా జీవన్‌ను కొట్టబోతుంటే.. సామ్రాట్ అపేస్తాడు. ఇంకోసారి ఇలా చేయకు ఈ ఇంటికి నేనెంతో నువ్వు అంతే అది మర్చిపోకు.. అంటూ మేనేజరును కూడా తిడుతూ.. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుకు సపోర్టు చేయకు ఇప్పుడు కూడా చంద్ర చూసి చెప్పడం వల్లే తెలిసింది అంటూ చెప్పగానే.. చంద్ర అబ్బా ఇరికించేశాడు అని మనసులో అనుకుంటుంది. దాక్షాయణి కూడా మనసులో ఈ అమ్మాయి ఫ్యామిలీ విషయాలలో కూడా కల్పించుకుంటుంది. వీలైనంత త్వరగా ఈ అమ్మాయిని పంపించేయాలి అని మనసులో అనుకుంటుంది.
గుడికి వెళ్లి వచ్చిన శ్రీజ ఎదురుగా వచ్చిన సామ్రాట్ కు గుడికి వెళ్లి వస్తున్నానని చెప్పి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తుంది. తనకు ఇచ్చిన ప్రసాదంలో సగం శ్రీజకు తినిపించిన సామ్రాట్.. శ్రీజ నువ్వు మాట్లాడితేనే అందంగా ఉంటావు.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండు.. లేదంటే ఇల్లంతా బోసి పోయినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు. శ్రీజ హ్యాపీగా ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఎదురుగా వచ్చిన మదన్‌ను చేయి పట్టుకుని మన ప్లాన్ సక్సెస్ అయిందండి.. మీరిచ్చిన ఐడియా ఫుల్ వర్కవుట్ అయిందండి. మా బావే నన్ను పిలిచి మాట్లాడారు.. నాకు లడ్డు కూడా తినిపించాడు అని చెప్పగానే.. మదన్ షాక్ అవుతాడు. శ్రీజ మాత్రం మీరిలాగే మా బావ పెళ్లికి ఒప్పుకునేలా ప్లాన్ ఇవ్వండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
గార్డెన్‌లో సామ్రాట్ ను పట్టుకుని థెరెప్పీ చేయిస్తుంటే.. గిరిజ చూసి షాక్ అవుతుంది. దగ్గరకు వెళ్లి కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే.. థెరప్పి చేస్తున్నాను అని చంద్ర చెబితే.. పట్టుకుని చేయాలా..? దూరంగా ఉండి చేయోచ్చు కదా అంటూ తిడుతుంది. అలా పట్టుకుని చేయించే థెరెప్పీలు ఏమైనా ఉంటే శ్రీజతో చేయించు అంటూ చెప్పగానే.. శ్రీజ చేస్తే మళ్లీ సామ్రాట్ గారు కోమాలోకి వెళ్తారు. గతం అసలు గుర్తుకు రాదు అంటూ చెప్పగానే.. అయితే సరే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత బావ మరదళ్ల రిలేషన్ గురించి సామ్రాట్ అడిగితే చంద్ర చెప్తుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.