E-Paper
Advertisement

చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ

చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ
Advertisement

Botsa Satyanarayana: ఉత్తర కోస్తాలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబుకు మాత్రం పబ్లిక్ స్టంట్లు చేయడమే సరిపోతోందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తుపాను నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో అక్రమాలు.. అధికారులకు హెచ్చరిక

Advertisement

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసిందని, ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బొత్స కోరారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎత్తుకెళ్లడమే కాకుండా, మరికొన్నిచోట్ల డబ్బు ఆశ చూపి లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పూసపాటిరేగలో ఆర్‌ఓ స్క్రూటినీని తప్పుగా నిర్వహించారని విమర్శించారు. ఇదే విషయంపై మాజీ గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా సంప్రదాయాలకు నిలయమని, ఇక్కడ తుచ్ఛ రాజకీయాలకు చోటులేదన్నారు. కొందరు అధికారులు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని, రేపు తమ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారి మనుగడ ఎలా ఉంటుందో చూస్తామని హెచ్చరించారు.

Advertisement

అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

గతంలో విజయవాడ, ఏలూరు, విశాఖ, విజయనగరం మేయర్ స్థానాలను గెలుచుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు. ఈసారి విజయనగరం మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణితో పాటు పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. ఎన్నికల ఖర్చు కోసం భూములు అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వానికి, అలాగే విశాఖలో గీతం భూములను కబ్జా చేసిన ఎంపీ భరత్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నిలబెట్టుకోలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెప్పాలని బొత్స పిలుపునిచ్చారు.

Also Read: మియాపూర్ భూముల కేసులో ప్రభుత్వ గెలుపు.. KCR, KTRలపై విరుచుకుపడ్డ చనగాని దయాకర్

Tags

Related News

ఎమ్మెల్యే రేంజ్ ఆస్తులు.. జెడ్పీటీసీగా పోటీ! ఎవరీ మమతశ్రీ?

గుంటూరు మేయర్‌ అభ్యర్థి, నా చెల్లిని గెలిపించాలని ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!

‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఉచితంగా నిత్యావసరాలు, రూ.3 వేలు సాయం

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

Big Stories

Advertisement
×