E-Paper
Advertisement

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!
Advertisement

Vastu Tips: సాధారణంగా ప్రతీరోజూ వాడే వస్తువుల్లో వాలెట్ (పర్సు) అత్యంత ముఖ్యమైనది. డబ్బులు, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఆధార్, పాన్ వంటివి భద్రంగా ఉంచుకోవడానికి అందరూ పర్సునే ఉపయోగిస్తారు. అయితే సాంప్రదాయ వాస్తు నమ్మకాల ప్రకారం వాలెట్ రంగు, దానిని ఉంచే విధానం.. ఆర్థిక స్థిరత్వానికి, సమృద్ధికి సూచికగా భావిస్తుంటారు. వాస్తు శైలిలో వివిధ రంగులకు ఒక్కో రకమైన ప్రత్యేకత ఉందనే భావన ప్రాచీన కాలం నుండి వస్తోంది. కాబట్టి వాస్తు సాంప్రదాయ నమ్మకం ప్రకారం ఏ రంగు వాలెట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆకుపచ్చ (Green)

ఆకుపచ్చ రంగును ప్రకృతి, కొత్త ఆరంభాలు, ఎదుగుదలకు సంకేతంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ రంగు కొత్త ఆర్థిక అవకాశాలను, వృద్ధిని ప్రోత్సహిస్తుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించేవారికి ఇది అనుకూలంగా ఉంటుందని అంటారు.

గోధుమ రంగు (Brown)

Advertisement

ఈ రంగు భూమి తత్వాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వం, భద్రత, క్రమశిక్షణకు ప్రతీక. పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టేవారికి బ్రౌన్ కలర్ పర్సు సరిగ్గా సరిపోతుందని నమ్ముతారు.

ఎరుపు (Red)

ఎరుపు రంగు అత్యంత శక్తివంతమైనది. ఇది ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, వేగానికి సంకేతం. అయితే వేగంగా కదిలే శక్తి వల్ల ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

పసుపు (Yellow)

Advertisement

భారతీయ సంస్కృతిలో పసుపు రంగుకు ప్రత్యేక
స్థానం ఉంది. ఇది జ్ఞానం, ఆశావాద దృక్బథం, సమృద్ధిని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పసుపు రంగును బృహస్పతి (గురుడు) గ్రహంతో ముడిపెడతారు. కాబట్టి విద్య, కెరీర్‌లో ఎదుగుదల కోరుకునేవారు దీనిని శుభప్రదంగా భావిస్తారు.

నలుపు (Black)

నలుపు రంగు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని రక్షణ, గాంభీర్యానికి సంకేతంగా చూస్తే మరికొందరు డబ్బు ప్రవాహానికి ఇది అంత అనుకూలం కాదని భావిస్తారు.

Also Read: రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

నమ్మకాలు vs వాస్తవం

అయితే పర్సు రంగు సంపదను పెంచుతుందనడానికి లేదా ఆర్థిక నష్టాలను నివారిస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవన్నీ పూర్తిగా వాస్తు, జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడిన ఆలోచనలు మాత్రమే. నిజానికి ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి అనేది అతని ఆదాయం, పొదుపు, సరైన బడ్జెట్ ప్రణాళిక, పెట్టుబడుల మీదే ఆధారపడి ఉంటుంది తప్ప పర్సు రంగుపై కాదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: రూ.550కే మౌస్, రూ.29 వేలకే ల్యాప్‌టాప్.. లెనోవో సేల్‌లో పిచ్చెక్కిస్తున్న ఆఫర్లు!

Tags

Related News

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!

స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

Big Stories

Advertisement
×