E-Paper
Advertisement

తల్లిదండ్రుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అమ్మానాన్నలంటే అమితమైన ప్రేమ

తల్లిదండ్రుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అమ్మానాన్నలంటే అమితమైన ప్రేమ
Advertisement

Birth Numbers of Caring Children| పిల్లలు పెద్దయ్యాక తమను ప్రేమగా చూసుకోవాలని, కష్టసుఖాల్లో అండగా నిలవాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచే అమ్మానాన్నల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపిస్తుంటారు. వారి మనసులోని బాధను మాటల్లో చెప్పకపోయినా గుర్తిస్తారు. అయితే అంకశాస్త్రం ప్రకారం.. పిల్లల పుట్టిన తేదీ వారి స్వభావంలోని కొన్ని ప్రత్యేక లక్షణాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా మూడు మూలాంకాలకు చెందిన పిల్లలు ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉంటారు. మరి ఆ మూలాంకాలు ఏవో, ఆ పిల్లల్లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.

మూలాంకం 2.. తల్లిదండ్రుల భావాలను అర్థం చేసుకునే పిల్లలు

న్యూమరాలజీ (అంకశాస్త్రం) ప్రకారం.. మూలాంకం 2కు చంద్రుడు అధిపతి. చంద్రుడి ప్రభావంతో ఈ మూలాంకం పిల్లలు సున్నిత మనస్కులుగా, భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీరు కుటుంబ సభ్యులపై ఎంతో ప్రేమను చూపిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల మనసులోని భావాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అమ్మానాన్నలు ఏదైనా విషయంపై బాధపడుతున్నా, ఆందోళన చెందుతున్నా వెంటనే గుర్తిస్తారు. వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల సంతోషం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇష్టపడతారు. ఏ నెలలోనైనా 2, 11, 20 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 2 అవుతుంది.

మూలాంకం 7.. కుటుంబ సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

Advertisement

అంకశాస్త్రంలో మూలాంకం 7కు కేతువు అధిపతి. ఈ మూలాంకం వారు ప్రేమ, అందం, సుఖసంతోషాలు, కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. వారి మాటలకు విలువ ఇస్తారు. అమ్మానాన్నల ఇష్టాయిష్టాలను గుర్తుంచుకుంటారు. వారి చిన్న చిన్న కోరికలను తీర్చడానికి ముందుంటారు.
కుటుంబంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలుస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కష్టకాలంలో తోడుగా ఉండటానికి వెనుకాడరు.
ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 7 అవుతుంది.

Also Read: విడాకుల రోజే రెండో పెళ్లి.. కోర్టు తీర్పురాక ముందే చెల్లుబాటు అవుతుందా?

మూలాంకం 9.. తల్లిదండ్రుల సేవ కోసం ముందుంటారు

Advertisement

మూలాంకం 9కు కుజుడు అధిపతి. కుజుడి ప్రభావంతో ఈ మూలాంకం పిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా ఉంటారని అంకశాస్త్రం చెబుతోంది.
వీరు కుటుంబం పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారు. తమ బాధ్యతలను గుర్తిస్తారు. తల్లిదండ్రులు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ముందుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అమ్మానాన్నల అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యుల రక్షణ, సంతోషం తమ బాధ్యతగా భావిస్తారు. ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 9 అవుతుంది.

Also Read: తేనెలా తియ్యగా మాట్లాడతారు.. ఈ తేదీల్లో జన్మించినవారు అందరినీ ఆకట్టుకుంటారు

ఈ మూడు మూలాంకాల పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రేమ ఎక్కువ

న్యూమరాలజీ ప్రకారం.. 2, 7, 9 మూలాంకాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రుల సంతోషానికి ప్రాధాన్యం ఇస్తారు. వారి అవసరాలను అర్థం చేసుకుంటూ, కష్టసమయాల్లో అండగా నిలుస్తారని చెబుతారు. అయితే ప్రతి పిల్లవాడి వ్యక్తిత్వం పెంపకం, కుటుంబ వాతావరణం, అనుభవాల ఆధారంగా కూడా రూపుదిద్దుకుంటుంది.

Related News

విదుర నీతి.. జీవితంలో పెద్ద కష్టాలు రాబోతున్నట్లు తెలిపే 3 సంకేతాలు ఇవే

బాత్రూమ్‌‌లో ఏ టైల్స్ వేస్తే మంచిది? కొనేముందు ఈ 5 రకాలు తెలుసుకోండి

సుగ్రీవుడికి అన్యాయం చేసిన వాలి.. మహాబలి హనుమాన్ ఎందుకు అడ్డుకోలేదు..

వాయు కాలుష్యం ఆపై సిగరెట్ తాగే అలవాటు.. ఊపిరితిత్తులు ఎంత త్వరగా దెబ్బతింటాయి..

ఆన్‌లైన్‌‌లో కనిపించేది ఒకటి ఆర్డర్ చేస్తే వచ్చేది మరొకటి.. ఆహార పదార్థాల్లో తప్పుడు వివరాలకు ఎవరిది బాధ్యత

ఓవెన్ అక్కర్లేదు.. బెల్లం, రాగి పిండి ఉంటే చాలు.. కడాయిలోనే టేస్టీ బిస్కెట్లు రెడీ!

బయట దొరికే పాస్తా కంటే 10 రెట్లు రుచిగా.. ఇంట్లోనే క్రీమీ చీజీ చికెన్ పాస్తా తయారీ విధానం!

Big Stories

Advertisement
×