Ravichandran Ashwin On MS Dhoni: 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు (2027 Indian Premier League tournament) సంబంధించిన వేలం దగ్గర పడుతుంది. దీంతో రిటెన్షన్, రిలీజ్ అటు ట్రేడ్ ప్రక్రియ శరావేగంగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై (MS Dhoni) రవిచంద్ర అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనిని ప్లేయర్ గా చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చిందని బాంబు పేల్చాడు.
రాహుల్ చాహర్, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లను రిలీజ్ చేసినప్పుడు ధోనిని ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ వదిలించుకోవడం లేదని ప్రశ్నించాడు. నాన్ ప్లేయింగ్ రోల్ లోకి ధోనిని తీసుకుంటే జట్టుకు మరో నాలుగు కోట్లు మిగులుతాయి కదా ? అంటూ ప్రశ్నించాడు. మహేంద్ర సింగ్ ధోనితో పాటు జట్టులో ఆడని ఇతర ఆటగాళ్లను కూడా రిలీజ్ చేస్తే ఆక్షన్ సమయానికి రూ.45 కోట్ల వరకు మిగులుతాయని సూచనలు చేశాడు. ఆ దిశగా అడుగులు వేసి మంచి ప్లేయర్లను కొనుగోలు చేయాలని పేర్కొన్నాడు. దీంతో ధోనిపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 మినీ వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మ్యాచ్ షార్ట్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లను కూడా చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేయాలని సూచనలు చేశాడు. కార్తీక్ శర్మ.. ఐపీఎల్ 2026లో బాగా రాణించినప్పటికీ అతని స్థానంలో శివం దుబే, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని పేర్కొన్నాడు. ఈ ఇద్దరినీ రిటైన్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని వెల్లడించాడు. అందుకే కార్తీక్ శర్మను వదిలించుకొని.. తెలివిగా ముందుకు వెళ్లాలని వెల్లడించాడు.
ధోని భవిష్యత్తు పైన ఎలాంటి క్లారిటీ లేదని.. అతని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక వైద్య పరీక్షల తర్వాతే తన ఆటకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటాడని ఇప్పటికే ధోని చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. తన అంచనా ప్రకారం ధోనీని రిలీజ్ చేస్తేనే బెటర్ అన్నాడు. తాను సూచించిన ప్లేయర్లను వదిలేస్తే రూ.45 కోట్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మిగులుతుందని వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా, ఇవాళ్టితో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియనుంది. డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా ఐపిఎల్ మినీ వేలం నిర్వహించనున్నారు.