Aadarsha kutumbam AK47:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటించిన చిత్రం ‘ ఆదర్శ కుటుంబం ఏకే 47’. అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా ఒక మోస్తారుగా ఆడియన్స్ ను మెప్పించింది. కలెక్షన్లు కూడా పరవాలేదు అనే రేంజ్ లో వస్తున్నాయి. ఇకపోతే మరోవైపు కొన్నిచోట్ల థియేటర్లలో ఈ సినిమా ఇప్పటికీ రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం.. ఆదర్శ కుటుంబం సినిమా త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారుగా రూ.40 కోట్లకు పైగా వెచ్చించినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతే ఆదర్శ కుటుంబం సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన పై చిత్ర బృందం నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలో ఆదర్శ కుటుంబం స్ట్రీమింగ్ కి రాబోతుందని చెప్పవచ్చు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనుంది.
ఆదర్శ కుటుంబం చిత్రం విషయానికి వస్తే.. నారా రోహిత్, యువినా పార్థవి , రాజ్ ప్రజ్వల్ , రావు రమేష్, బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. రవికే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.
also read:నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు
ఆదర్శ కుటుంబం సినిమా స్టోరీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ వ్యక్తి చిట్టిబాబు (Venkatesh). ఏదో ఒక చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే ఆయన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) కి గొంతెమ్మ కోరికలతో అప్పుల పాలవుతారు. అలాంటిది వీరు సడన్‌గా ఒక లగ్జరీ విల్లాలోకి చేరుతారు. అప్పుడే వీరి ఫ్యామిలీకి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. మరి చిన్న ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని పోషించిన చిట్టిబాబు ఉన్నటువంటి లగ్జరీ విల్లాలోకి ఎలా మారాడు? గ్యాంగ్ స్టార్ తో అతనికున్న సంబంధం ఏమిటి? ఇందులో నారా రోహిత్ పాత్ర ఏంటి?! అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు పెంచేసి ప్రేక్షకులను థియేటర్లలో ఒక మోస్తారుగా మెప్పించిన ఈ సినిమా.. ఇటు ఓటిటిలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.