BigTV English

Robinhood : నితిన్ వల్ల పాపం మైత్రీ వాళ్లకు భారీ స్ట్రోక్

Robinhood : నితిన్ వల్ల పాపం మైత్రీ వాళ్లకు భారీ స్ట్రోక్

Robinhood : మైత్రీ మూవీ మేకర్స్… ప్రస్తుతం ఇది మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు. పుష్ప 2 మూవీతో ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూళ్లు చేసి ఇండియానే టాప్ పొజిషన్‌లోకి వెళ్లిపోయింది. అది ఒకటే కాదు… ఈ మధ్య మైత్రీ వాళ్లు చేస్తున్న సినిమాలకు మంచి లాభాలు కూడా వస్తున్నాయి. అలాంటి టైంలో ఇప్పుడు బిగ్ స్ట్రోక్ తగిలింది. యంగ్ హీరో నితిన్ నుంచి ఆ స్ట్రోక్ మైత్రీ వాళ్లకు వచ్చింది.


బ్యాక్ టూ బ్యాక్ బిగ్ బడ్జెట్ చేస్తూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ గా మారుతున్న మైత్రీ మూవీ మేకర్స్.. మధ్యలో ఓ మిడ్ రేంజ్ హీరోతో… మిడ్ రేంజ్ మూవీని చేసింది. అదే రాబిన్ హుడ్. పేరుకు మిడ్ రేంజ్ హీరో సినిమా కానీ, దానికి ఎక్కడా తక్కువ చేయలేదు. దాదాపు 70 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో ఫస్ట్ టైం యాక్టింగ్ చేపించారు. అందుకు దాదాపు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు.

అలాగే… ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. హీరో నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుమలతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేవిడ్ వార్నర్ ను తీసుకొచ్చి… హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా అన్నీ కూడా ఓ భారీ సినిమాకు చేసినట్టే చేశారు. కానీ ఈ మూవీ వీరికి భారీ నష్టం వచ్చేలా చేసింది.


25 కోట్ల వరకు నష్టం..?

రాబిన్ హుడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 30 కోట్ల వరకు జరిగింది. అంటే.. ఈ మూవీ లాభాల బాట పట్టాలంటే… 31 కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. కానీ, ఈ మూవీకి ఇప్పటి వరకు వచ్చిన షేర్ కలెక్షన్లు కేవలం 6.5 కోట్లే. అంటే కాస్త అటు ఇటుగా నితిన్ వల్ల మైత్రీ మూవీ మేకర్స్ కి వచ్చిన నష్టం దాదాపు 25 కోట్లు అని తెలుస్తుంది.

నితిన్‌కే ఎక్కవ నష్టం..?

మైత్రీ మూవీ మేకర్స్ కు 25 కోట్ల నష్టం అనేది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఎందుకంటే… వీళ్లు ఇప్పటికే చాలా సినిమాల నుంచి మంచి లాభాలు అందుకున్నారు. ముఖ్యంగా పుష్ప 2 మూవీ. అలాగే.. రాబోయేవి కూడా భారీ బడ్జెట్ మూవీస్. అవి నష్టాలు తీసుకుచ్చే ఛాన్స్ జీరో. అలాంటి సినిమాలు ముందు ఉన్నాయి.

కానీ, నితిన్ కి ఈ రాబిన్ హుడ్ మూవీ కెరీర్ లో చాలా కీలకమైనది. ఈ మధ్యలో ఆయన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఇలాంటి టైంలోనే ఇప్పుడు మరో… ప్లాప్ రావడం ఆయన కెరీర్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అయితే నితిన్ కు బలగం ఫేం వేణు చేయబోయే ఎల్లమ్మ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×