Mad Square : బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం నిర్మాత నాగ వంశీ (Suryadevara Nagavamsi). ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ కావడంతోనే బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతుంది అనుకున్న ఈ మూవీ తగ్గకుండా భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఈ నేపథ్యంలోనే మరో మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారు నిర్మాత నాగ వంశీ. ఈ మేరకు ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసి, దానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారు. మరి ఎన్టీఆర్ (Jr NTR) రావడం వల్ల ఈ సినిమాకు వచ్చే లాభమేంటి? అన్న వివరాల్లోకి వెళ్తే…
‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా…
2023 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్ గా వచ్చింది ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి తమన్ నేపథ్య సంగీతం అందించారు.
మార్చ్ 28న థియేటర్లలోకి వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మొదటి వారమే 50 కోట్ల క్లబ్లో చేరింది. మూవీ లాభాల బాట పట్టడం పట్ల సంతోషంగా ఉన్న నిర్మాత నాగ వంశీ ఎన్టీఆర్ ను రంగంలోకి దించి, ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పని పడ్డారని సమాచారం. ఏప్రిల్ 4న ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ శిల్పకళా వేదికలో జరగబోతోంది.
ఎన్టీఆర్ తో నాగ వంశీ మాస్ ప్లానింగ్
ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మూవీని చంపొద్దు అంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి అంటూ రివ్యూ రైటర్లకు సవాల్ కూడా విసిరారు. సినిమాకు మంచి రెస్పాన్స్క, లెక్షన్స్ వస్తుంటే కంటెంట్ లేకపోయినా కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ? అనే విశ్లేషణ ఇవ్వద్దు అంటూ మండిపడ్డారు. దీంతో ముందుగా అందరూ ఇది నాగ వంశీ ఆవేదన అనుకున్నారు. కానీ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఇదొక ప్రమోషనల్ స్టంటా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
నాగ వంశీ ప్రెస్ మీట్ ఫలితంగా మూవీ కలెక్షన్స్ పరంగా పరుగులు పెట్టింది. ఇక ఈ మూవీని 100 కోట్ల క్లబ్ లో చేర్చడమే లక్ష్యంగా ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే ప్లాన్ చేశారు నిర్మాత. సినిమాకు తారక్ సపోర్ట్ కూడా తోడైతే కచ్చితంగా ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందనేది వాస్తవం. కాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో నటించిన హీరోలలో నార్నే నితిన్ కూడా ఒకరు. ఎన్టీఆర్ ఆయనకు స్వయానా బావ మరిది వరస అవుతారు.