Olive Oil For Skin: ఆలివ్ ఆయిల్ చర్మ సౌందర్యానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆలివ్ ఆయిల్‌లో తగిన మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఎ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు తొలగించుకోవడంలో ఇది చాలా ప్రభావ వంతంగా ఉంటుంది.
చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలో చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తే.. చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. చర్మం పొడిబారడంతో పాటు, ముఖంపై మచ్చలు, టానింగ్ వంటివి రాకుండా ఉంటాయి. మరి ఆలివ్ ఆయిల్ ముఖానికి ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు:
ఆలివ్ ఆయిల్‌లో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మంపై ఎక్కడైనా టానింగ్ సమస్య ఉంటే ఆలివ్ ఆయిల్ వాడండి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచి, మృతకణాలను తొలగించి తిరిగి శక్తినిస్తుంది. దీని రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
ముఖ్యంగా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు, మన చర్మం నిర్జీవంగా మారుతుంది . ఇలాంటి సమయంలో ఆలివ్ ఆయిల్ తో ముఖాన్ని తేమగా చేయవచ్చు. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని మీ చర్మంపై అప్లై చేస్తే, ఉదయం మీ చర్మం చాలా హైడ్రేటెడ్‌గా కనిపిస్తుంది.
ఫైన్ లైన్స్ వదిలించుకోండి:
ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. మీరు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే, మీ ముఖంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ముఖంపై ముడతలు, ఫైన్ లైన్లు , చర్మం వదులుగా ఉండటాన్ని నివారించడంలో చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా మీ ముఖం మీద నల్ల మచ్చలు లేదా పిగ్మెంటేషన్ సమస్య ఉంటే, ఆలివ్ ఆయిల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రాత్రిపూట మీ ముఖానికి ఆలివ్ నూనె రాయడానికి సరైన మార్గం:
ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడానికి, మీరు కొన్ని ముఖ్యమైన దశలను అనుసరించాలి. ముందుగా, మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి. తర్వాత తేలిక పాటి ఫేస్ వాష్ ఉపయోగించి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది మీ ముఖం నుండి దుమ్ము, ధూళి అంతా తొలగిస్తుంది. ఇప్పుడు ఆలివ్ ఆయిల్‌ను కాస్త వేడి చేయండి. వేడి నూనె ముఖంపై త్వరగా పీల్చుకుని మంచి ఫలితాలను ఇస్తుంది. మీ చేతుల్లో నూనెను చర్మంపై మసాజ్ చేయండి. కొంత సేపు ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి తాజాదనం వస్తుంది. తర్వాత ఆయిల్ రాత్రంతా ముఖం మీద ఉంచండి, తద్వారా ఇది మీ చర్మాన్ని లోతుగా తేమగా చేస్తుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత, గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
Also Read: అవిసె గింజలతో.. అద్భుత ప్రయోజనాలు !
పగిలిన పెదవుల సమస్య తొలగిపోతుంది:
పెదవులపై ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల పగిలిన పెదవుల సమస్య పరిష్కారం అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ ను పెదవులపై రాసుకుంటే, మీ పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. కళ్ళ కింద ఆలివ్ నూనెను రాసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది. ఇది బయో ఆయిల్ కాబట్టి.. దీన్ని ఉపయోగించడం వల్ల, సాగిన గుర్తులు కూడా తేలిక అవుతాయి.