ETV Win Upcoming Movies : ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) తాజా సినిమాలు, టీవీ షోలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్ లు వంటి తెలుగు భాషా కంటెంట్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓటీటీ సక్సెస్ ఫుల్ గా రెండు వార్షికోత్సవాలను పూర్తి చేసుకుని, మూడవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. యూత్ ఫుల్ కంటెంట్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు, సిరీస్ లను అందిస్తున్న ఈ ఓటీటీ తాజాగా తమ సబ్స్క్రయిబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. అందులో కొన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి.
అనగనగా (Anaganaga)
సుమంత్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా’. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా స్ట్రీమింగ్ కానుంది.
కానిస్టేబుల్ కనకం (Constable Kanakam)
వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల కీలకపాత్రల్లో నటించిన మూవీ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దీని రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.
ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR All India Rankers)
ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ లో హర్ష రోషన్, భాను ప్రతాప్, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి తదితరులు మెయిన్ లీడ్స్ గా నటించారు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు.
ఎస్ఎస్ఎస్ (SSS)
శివాజీ, లయ, రోహన్ రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఎస్ఎస్ఎస్’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ (SI Yugandhar)
ఆది సాయికుమార్, మేఘా లేఖ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ దీనికి యశ్వంత్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీ కూడా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది.
మట్టి కథలు (Matti Kathalu)
తనికెళ్ల భరణి, నరేశ్, బాలాదిత్య తదితరులు లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ‘మట్టి కథలు’. ఈ మూవీ కూడా ఈటీవీ విన్ లోనే స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే మరో కొత్త మూవీ కూడా ఈ ఓటీటీలోనే రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలు ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు చిన్న పిల్లలను సైతం అట్రాక్ట్ చేసే విధంగా ఈటీవీ విన్ ఇటీవలే కొన్ని యానిమేషన్ సిరీస్ లను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.