New virus In China: కరోనా ఈ పేరు వింటే ప్రతి ఒక్కరి గుండెల్లో దడపుడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చనిపోయిన వ్యక్తి చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోనంతగా కరోనా కోరలు చాచి కాటేసింది. మన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిన వారికి కూడా దూరంగా పెట్టాల్సివచ్చిన పరిస్థితి. అదృష్టం బాగోలేక చనిపోతే వారిని అటునుంచి అటే కాటికి తీసుకెళ్లిన రోజలవి. అబ్బో తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. అలా అప్పటి నుంచి వైరస్ పేరు చెబితే.. అది కూడా చైనా వైరస్ అంటే గుండె పగిలిపోయేంత పనవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా నుంచి మరో కొత్తవైరస్ తెరపైకి వచ్చింది.
చైనా నుంచి మానవాళికి మరోసారి ముప్పు పొంచి ఉందా? ఔననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కొవిడ్ తరహాలోనే.. చైనాలో గబ్బిలాల ద్వారా ఓ కొత్త వైరస్ మనుషులకు.. సోకే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే HKU5 వైరస్.. ఒకే మ్యూటేషన్ ద్వారా మనుషులకు సోకుతుందని గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారి మరణాలు 34 శాతం అని చెబుతున్నారు. మింక్ జంతువులకు ఇప్పటికే ఈ వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చైనాలోని ఒక ప్రయోగశాలలో.. HKU5 వైరస్‌ను మొదట గబ్బిలాలలో గుర్తించారు. ఇది కూడా COVID వైరస్ జాతికి సంబంధించిందే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. HKU5 వైరస్ మానవ కణాలతో ఎలా వ్యాప్తి చెందుతుందో.. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు ధ్యయనం చేశారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో చిన్న మార్పు జరిగితే.. అది మానవుల గొంతు, నోరు, ముక్కులో ఉండే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్స్‌తో అభివృద్ది చెందుతుంది. ACE2 కణాలతో బంధం ఏర్పరచడానికి అవసరమైన మార్పులు ఉంటే వైరస్ సులభంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఈ స్పైక్ ప్రోటీన్లు ఏవిధంగా అభివృద్ది చెందుతాయో తెలుసుకోవడానికి అత్యాధునిక AI టూల్ ఆల్ఫాఫోల్డ్ 3ని ఉపయోగించారు. ఈ సాఫ్ట్‌వేర్ నిమిషాల్లో మానవ కణాలతో జన్యు మార్పులు, పరస్పర చర్యలను ఏవిదంగా మారుతాయో చూపించింది. స్పైక్ ప్రోటీన్‌లో కీలక భాగాలు క్లోజ్డ్ స్థితిలో ఉన్నాయని.. ఇది సోకడం కష్టమని చెబుతున్నారు. కానీ వైరస్ మనుషులకు సోకడానికి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే ఏడుగురు మృతి
మరోవైపు దేశంలో కరోనా డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. 2025 జనవరి నుంచి మొత్తం కరోనా మరణాలు 55కి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్టైంది. 24 గంటల్లో498 కొత్త కేసులు నమేదు అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏపీలో 62, తెలంగాణ 5, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క కేరళలోనే 1487 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 4866యాక్టివ్ కేసులు ఉన్నాయని.. నిన్న ఒక్కరోజే 564 కొత్త కేసులు నమోదవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.