Coronavirus Deaths Update: యావత్ ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజా విసురుతోంది. చాపకింద నీరులా దేశంలో వ్యాప్తి చెందుతుంది. కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 4866 కేసులు నమోదు గాక.. ఒక్కరోజులోనే కరోనాతో ఏడుగురు మృతి చెందారు.
2025 జనవరి నుంచి మొత్తం కరోనా మరణాలు 51కి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్టైంది. నిన్న ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
తాజాగా ఏలూరు కలెక్టరేట్‌లో పని చేస్తున్నఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 50కు చేరుకుందని.. నిన్న ఒక్కరోజే 19 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క కేరళలోనే 1487 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 4866యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గురువారం ఒక్కరోజే 564 కొత్త కేసులు నమోదవడంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల యువకుడు చనిపోగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఐతే వీరిద్దరు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు నిర్ధారించారు.
కరోనా విజృంభన సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పందిస్తూ.. ఇతర వేరియంట్లతో పోలీస్తే ఇప్పుడున్న వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాదని తెలిపింది. గతంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. అనారోగ్యంతో ఉన్న వాళ్లపైనే ఇప్పుడు వైరస్ ప్రభావం చూపిస్తోందని తెలిపింది. మిగతా వాళ్లపై పెద్దగా ప్రభావం చూపించటం లేదని.. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది.
Also Read: ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. ఎలాంటి ముఖం ఐనా తెల్లగా మారాల్సిందే!
కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ర్యాపిడ్ టెస్టులతో పాటు ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లేప్పుడు మాస్క్ ధరించాలని సూచించింది. లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితిల్లో అయినా ఎదుర్కోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కోవిడ్ వ్యాప్తిలో ఏపీ 11వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి.