Intinti Ramayanam Today Episode june 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ప్లాన్ ఇదంతా అని అక్షయ్ కు చెప్పగానే.. అక్షయ్ ఎందుకు ఇదంతా చేసావని పల్లవి పై సీరియస్ అవుతాడు. నేను చెప్తే మీరు నమ్మరు కదా పల్లవిది ఎంత క్రిమినల్ బ్రెయిన్ డ్రైవర్ చెప్తాడు అని డ్రైవర్ ని పిలుస్తుంది. డ్రైవర్ చెప్పగానే అక్షయ్ అది నిజమే అని నమ్ముతాడు.. నిజంగానే ఇదంతా పల్లవినే చేసిందని అక్షయ్ నమ్మేస్తాడు. పల్లవిని ఇదంతా ఎందుకు చేస్తావ్ నిజం చెప్పు లేదా పోలీసులను పిలవమంటావా అని అక్షయ్ సీరియస్ అవుతాడు.. పల్లవి అడ్డంగా దొరికిపోయానని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడే చక్రధర్ అక్కడికొచ్చి నేను చెప్తాను.. ఫైల్స్ మార్చింది వీరిద్దరే నిజం చెప్పండిరా అని చక్రధర్ వాళ్ళిద్దర్నీ తీసుకొస్తాడు.. ఆ ఫైల్స్ మేమే మార్చింది. మా కంపెనీ షేర్స్ వాటాను తీసుకోవాలని అలా చేసాము. అవని మేడం ఫైల్ ని చదివిన తర్వాత మేము ఈ ఫైల్ ని కూడా అందులో మార్చేసాము అని వాళ్ళు చెప్తారు. కానీ అవని మాత్రం వీళ్ళు చెప్పేదంతా నిజం కాదు అబద్ధం అని అరుస్తుంది. వీళ్లు వీళ్లతో కుమ్మక్కయి అబద్దం చెబుతున్నారు పోలీసులను పిలవండి. అసలు నిజం ఏంటో కనిపెడతారు అని అవని అంటుంది.. చక్రధర్ రావడంతో పల్లవి సేఫ్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇదంతా అయిపోయిన తర్వాత అక్షయ్ పల్లవి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లడంతో అందరూ ఆరా తీస్తారు. మీరిద్దరూ కలిసి వచ్చారేంటి అని పార్వతి అడుగుతుంది. ఈరోజు అవని అక్క చేసిన పనికి నన్ను అందరూ తప్పుగా అనుకునే వాళ్ళు అని పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది. కమల్ శ్రీకర్ ఒకవైపు మా వదిన మంచిదని ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ పార్వతి ఇద్దరూ కూడా వారిని అరుస్తారు.. పల్లవి అవని అక్కని మామయ్య గారు కావాలని బావగారి పక్కన కూర్చోబెట్టారు.. కనీసం ఆఫీసులో ఎటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టే అధికారం కూడా బావగారికి లేకుండా అవనికే ఇచ్చారు అని అంటుంది.. అంతేకాదు బావగారికి అధికారం రాకుండా కంపెనీని లాగేసుకునే ప్రయత్నం ఇది అని పల్లవి చెప్పగానే పార్వతి సీరియస్ అవుతుంది.
పల్లవి మొత్తానికి పార్వతిని రెచ్చగొడుతుంది. లేనిపోనివి కల్పించి చెప్పి అక్షయ్ బావగారికి అధికారం వచ్చేలా చేయాలని చెప్తుంది.. పల్లవి మాటల్ని గుడ్డిగా నమ్మిన పార్వతి అక్షయ్ ని అందర్నీ తీసుకొని ఈ విషయాన్ని ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటానని రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్తారు.. అవని ఇంటికి త్వరగా రావడంతో ప్రణతి ఏమైంది వదిన ఇంత త్వరగా వచ్చారు ఆఫీస్ లో పని లేదా అని అడుగుతుంది. అవని మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న రాజేంద్రప్రసాద్ సుదర్శన్ కంపెనీ అప్డేట్ గురించి అడుగుతాడు. కానీ ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది.
అవని వదిన ఇంత డల్ గా ఉండడం నేనెప్పుడూ చూడలేదు ఏదైనా సమస్య వచ్చిందా అని ప్రణతి స్వరాజ్యం ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీసులో బాధ్యతలు తీసుకుంది కదమ్మా ఏదో ఒకటి టెన్షన్లు ఉంటాయి అలవాటు అయ్యేంతవరకు అలానే ఉంటుందేమోలే అని లోపలికి వెళ్తారు. రాజన్నప్రసాద్ అవని మీకు ఏమైనా చెప్పిందా ఎందుకలా ఉంది అని అడుగుతాడు.. అప్పుడే పార్వతీ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వీళ్ళందరూ రావడానికి అవని డల్లుగా ఉండడానికి ఏదైనా కారణం ఉందా అని అనుకుంటారు.
పార్వతిని చూడగానే ప్రణతి తల్లి పై ప్రేమతో హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అని పార్వతి మాత్రం ఏ మాత్రం చెల్లించకుండా మౌనంగా ఉంటుంది. నేను నీ కూతురు అన్న సంగతి నువ్వు మర్చిపోయావా అమ్మ అని అడుగుతుంది. కానీ పార్వతి నువ్వు మా కూతురు వలన సంగతి నాకు గుర్తుంది నీకు గుర్తుంటే అందరితో కలిసి అక్కడే ఉండే దానివి.. ఇక్కడ ఉండే దానివి కాదు కదా అని అంటుంది. మీరు చేసేది ఏం బాగోలేదండి అని పార్వతి అడుగుతుంది..
అవనికి అన్ని అధికారాలు ఇచ్చి అక్షయ్ ని ఇలా తక్కువ చేసి చూడడం మీకు ఏమైనా బాగుందా అని పార్వతి రాజేంద్రప్రసాద్ నిలదీస్తుంది. ఈ విషయం గురించి మీరు అడగడానికి వచ్చుంటే మీరు వెళ్లిపోవచ్చు. నాకు అవని గురించి అన్ని విషయాలు తెలుసు అని రాజేంద్రప్రసాద్ పార్వతికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. అక్షయ్ కి కనీసం సంతకాలు చేసే అధికారం కూడా ఇవ్వకుండా మీ తర్వాత ప్రతిదీ అవనీకివ్వడం ఏమైనా బాగుందా అని అడుగుతుంది. మీరు ఇలా అన్ని అధికారాలు ఇస్తే ఆ ఇంటితో సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది అని పార్వతి అంటుంది. అయితే ఈ విషయంలో మా మాట వినకుండా ఉంటే నేను చచ్చినంత ఒట్టే అని పార్వతి అంటుంది.
ఇక కమల్, శ్రీకర్ ఇద్దరు అవని వదిన ఎలాంటిదో మా అందరికీ తెలుసు.. అవని ఇప్పటికే నా మీద నిందలు మీద నిందలు వేస్తున్నారు. ఆస్తి కోసమే నేను ఇదంతా చేశానని ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు ఆయననుంచి నేను పవర్ ని లాగేసుకున్నానని నాపై మరో నింద వేస్తున్నారు మావయ్య. కుటుంబం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆస్తి అంతస్తులు ఇవన్నీ నాకు ఏవి అక్కర్లేదు మామయ్య.. దయచేసి ఈ అధికారాన్ని మొత్తం ఆయన పేరు మీదకి రాసేయండి నేనంటే మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే ఆస్తులు మొత్తాన్ని ఆయన గారి పేరు మీద మార్చేయండి అని అవని అడుగుతుంది.. రాజేంద్రప్రసాద్ ని పక్కకు కూడా వెళ్ళనివ్వకుండా పార్వతి అక్షయకి ఎలాగైనా అధికారాన్ని ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. అవని కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ పార్వతి తెచ్చిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడతారు. ఆ డాక్యుమెంట్స్ ని మొహాన కొట్టేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..