Onion Juice For Hair: నేడు చిన్నా పెద్దా తేడా లేకుండా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది రకరకాల షాంపూలతో పాటు హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ లో జుట్టు హాని కలిగించే అంశాలు కూడా ఉంటాయి. అందుకే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి వీటికి బదులగా ఉల్లిపాయ రసం వాడటం మంచిది.
ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిజానికి.. ఉల్లిపాయలలో సల్ఫర్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల నుంచి పోషిస్తాయి. జుట్టు రాలే సమస్య ఎదుర్కునే వారు తరచుగా ఉల్లిపాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ జ్యూస్ జుట్టు పెరగడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇది బట్టతల సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. సల్ఫర్ జుట్టును బలోపేతం చేయడంతో పాటు దాని ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం, కలబంద జెల్:
ఉల్లిపాయ రసం లాగే.. కలబంద జెల్ కూడా జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా, బలంగా మార్చడంలో సహాయపడుతుంది. కలబందలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి .
ఎలా తయారు చేయాలి ?
ఒక చిన్న కప్పు టీస్పూన్ల ఉల్లిపాయ రసం తీసుకుని, దానికి 3-4 టీస్పూన్ల కలబంద జెల్ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు , జుట్టు మూలాలకు పూర్తిగా అప్లై చేయండి. ఒక గంట పాటు ఇలాగే వదిలేసి.. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. మీరు దీనిని వారానికి 2-3 సార్లు కూడా ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెను శతాబ్దాలుగా జుట్టుకు పోషణ, బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
Also Read: ఇలా చేస్తే.. ఎంత నల్లటి ముఖం అయినా, తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?
ఎలా తయారు చేయాలి ?
ఒక చిన్న కప్పు ఉల్లిపాయ రసాన్ని 2-3 టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి. తర్వాత మీ తలకు బాగా మసాజ్ చేయండి. దీనిని జుట్టుకు అప్లై చేసి గంటసేపు అలాగే ఉంచి, తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఈ రెమెడీని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.
సూచనలు:
1.ఉల్లిపాయ రసం కొంతమందికి చికాకు కలిగించవచ్చు. అప్లై చేసే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ (చెవి వెనుక లేదా మోచేయి లోపలి భాగంలో) చేయడం మంచిది.
2.వాసన ఇబ్బంది అనిపిస్తే..ఉల్లి రసంలో కొన్ని చుక్కల లావెండర్ లేదా రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు.
3. ఉల్లిపాయ రసం కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.