Ambati Angry: వైసీపీకి టెన్షన్ మొదలైందా? జగన్ పల్నాడు టూర్‌లో రెచ్చిపోయిన వారు బుక్కైపోయారా? నేతల నుంచి కార్యకర్తల వరకు కేసులు నమోదు అవుతున్నా యా? పరిస్థితి గమనించిన అంబటి, మంత్రి లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? జగన్ టూర్లకు తాము రామని కేడర్ ముఖం మీద నేతలకు చెప్పేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు (హెలికాప్టర్ ఘటన), ప్రకాశం జిల్లా పొదిలి (టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వడం ), పల్నాడు జిల్లా రెంటపాళ్ల(కటౌట్ల వ్యవహారం) జిల్లాలకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. పర్యటనల సందర్భంగా కార్యకర్తలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
కటౌట్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్తల వీడియోలు వైరల్ అయ్యాయి. వాటి ఆధారంలో పోలీసులు రంగంలోకి దిగేశారు. కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఒకొక్కర్ని పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. పొదిలి ఘటనపై ఇప్పటివరకు 25 మందిపై కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది.
పల్నాడు టూర్ వ్యవహారంపై వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రుబాబు చేసిన కార్యకర్తలు, కటౌట్లు ప్రదర్శించిన వారిని అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి గమనించిన వైసీపీ నేతలు ఇకపై జగన్ పర్యటనలకు తాము రామని తేల్చి చెబుతున్నారట. మీ పర్యటనలు ఏమోగానీ మాపై కేసులు బుక్కవుతున్నాయని అంటున్నారు.
ALSO READ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐదురోజల ముందు రేషన్
పరిస్థితి గమనించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మంత్రి నారా లోకేష్‌కు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుని 53 రోజులు జైలులో పెట్టారనే కోపంతో ఇంతమందిని లోపల పెడుతున్నావని రుసరుసలాడారు. అరెస్టుయినవాళ్లంతా కక్ష పెంచుకుంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు.
తాము మనోధైర్యాన్ని కోల్పోమని, మనోధైర్యం ఉన్నావాళ్లమి గనుకే రాజకీయాల్లోకి వచ్చామన్నారు మాజీ మంత్రి. ఎన్నాళ్లు జైలులో పెడతారో పెట్టుకో మేము చూస్తామని, అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని చెప్పకనే చెప్పారు. అయినా శాంతి భద్రతల విషయం హోంమంత్రి చేతులో ఉంటుందని, అయినా మంత్రి లోకేష్‌ని హెచ్చరించడం ఏంటని టీడీపీ నేతల ప్రశ్న.
కావాలనే మంత్రి లోకేష్‌పై బురద జల్లుతున్నారని అంటున్నారు. పనిలో పనిగా సింగయ్య మృతి వ్యవహారంలో జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
రాజకీయంగా తమను అణిచి వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అంబటి. లోకేష్ ఆదేశాలతో పోలీసులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ బెదిరింపులకు రాజకీయాలు వదిలి పెట్టి పోవాలా అంటూ ప్రశ్నించారు. మేం రౌడీలమా? సంఘ విద్రోహ శక్తులమా? కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తలమని చెప్పారు.
జగన్ సంఘ విద్రోహ శక్తి అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సినిమా డైలాగ్‌ను ప్రదర్శిస్తే తాము ఫ్లెక్సీలు పెట్టించామని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ఫ్లెక్సీని ప్రదర్శించింది మీ పార్టీ కార్యకర్తేనంటూ ఆ నెపాన్ని టీడీపీపై తోసే ప్రయత్నం చేశారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం కేసులతో వైసీపీ కేడర్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి వెలుగులోకి మరో కీలక అంశం..
జగన్ వాహనం కింద పడటం వల్లే చీలి సింగయ్య మృతి చెందినట్లు వీడియో వైరల్
జగన్ ర్యాలీలోని వాహనాల వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు pic.twitter.com/ctOSxyRBoz
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025
మంత్రి నారా లోకేష్ కు అంబటి వార్నింగ్..
మీ నాన్నని 53 రోజులు జైలులో పెట్టారనే గా ఇంత మందిని లోపల పెడుతున్నావ్..
వాళ్లంతా కక్ష పెంచుకుంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో
మేం మనోధైర్యాన్ని కోల్పోము
మనోధైర్యం ఉన్నావాళ్లే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం
ఎన్నాళ్లు జైలులో… pic.twitter.com/sQkvK03TjG
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025