E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో మొక్కలు కొంటున్నారా? మీ ఇంట్లోకి వైరస్‌లు రావొచ్చు!

ఆన్‌లైన్‌లో మొక్కలు కొంటున్నారా? మీ ఇంట్లోకి వైరస్‌లు రావొచ్చు!
Advertisement

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో విదేశీ అలంకరణ మొక్కలు, రంగురంగుల పూల విత్తనాలు ఆర్డర్ చేస్తున్నారా? ఆ చిన్న పార్సిల్ మీ గుమ్మానికి చేరగానే ఎంతో సంబరపడిపోతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఆ కొరియర్ బాక్స్‌లో అందమైన మొక్కలతో పాటు యావత్ భారత వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే ప్రమాదకరమైన వైరస్‌లు, కొత్త రకం తెగుళ్లు, పురుగులు కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతున్నాయని మీకు తెలుసా? ఇంటర్నేషనల్ బిజినెస్ ముసుగులో ఆన్‌లైన్ పార్సిళ్ల ద్వారా సరిహద్దులు దాటుతున్న ఈ డిజిటల్ బయో ముప్పుపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ లెటెస్ట్ రిపోర్ట్.. ఇప్పుడు కాస్త భయపెడుతోంది.

ఆ రిపోర్టులో ఏం ఉంది?

ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్, కొరియర్, పోస్టల్ సేవల విస్తరణ ఎంత వేగంగా పెరిగిందో.. వ్యవసాయ రంగానికి తెగుళ్ల ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఈ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల 100 కోట్ల పార్సిళ్లు రవాణా కాగా.. 2027 నాటికి ఈ సంఖ్య ఏకంగా 25,600 కోట్లకు చేరుతుందని అంచనా. సమస్య ఎక్కడుందంటే.. విమానాలు, ఓడల్లో టన్నుల కొద్దీ వచ్చే సరుకును క్వారంటైన్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కానీ, చిన్న చిన్న కొరియర్ కవర్లలో పోస్టల్ ద్వారా నేరుగా ఇళ్లకు చేరే విత్తనాలు, దుంపలు, మొక్కల ఉత్పత్తులపై నిఘా పెట్టడం ఏ దేశానికీ సాధ్యం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లోని నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. సరిహద్దుల్లో తనిఖీలు ఏ మూలకూ సరిపోవడం లేదు. ఏ ఒక్క దేశంలోనూ కనీస రక్షణ సూచీ 62 శాతానికి మించి పని చేయడం లేదని యూఎన్ రిపోర్ట్ చెబుతోంది.

మొక్కల వ్యాపారానికి ప్రత్యేక చట్టాలు లేకపోవడమే సమస్య?

Advertisement

ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు కారణాలను యూఎన్ రిపోర్ట్ క్లియర్‌ కట్‌గా చెప్పింది. మొదటిది.. ఈ-కామర్స్ ద్వారా జరిగే మొక్కల వ్యాపారానికి సంబంధించి చాలా దేశాల్లో ప్రత్యేక చట్టాలు లేదా నిబంధనలు లేవు. ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో దాదాపు 73 శాతం దేశాల్లో కనీస మార్గదర్శకాలు కూడా కరవయ్యాయి. రెండోది.. కేవలం 43 శాతం నియంత్రణ సంస్థలకు మాత్రమే అనుమానాస్పద కొరియర్ డేటాను పరిశీలించే సాంకేతిక వెసులుబాటు ఉంది. ప్రజలు అనుమానిత వృక్ష ఉత్పత్తులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వేదికలు ప్రపంచంలో కేవలం 29 శాతం దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక మూడోది, అత్యంత ప్రమాదకరమైనది.. సమన్వయ లోపం! మొక్కల ఉత్పత్తులు సరిహద్దులు దాటి రవాణా అవుతున్నప్పుడు కస్టమ్స్ అధికారులు వ్యవసాయ పర్యవేక్షణ సంస్థలకు సమాచారం ఇచ్చే ప్రక్రియ 88 శాతంగా ఉంటే.. పోస్టల్ విభాగంలో అది 66 శాతానికి, ప్రైవేట్ కొరియర్ సర్వీసుల్లో కేవలం 58 శాతానికి పడిపోయింది. అనుమానిత పార్సిళ్లను అడ్డుకోవడంలో ప్రైవేట్ కొరియర్ సంస్థల నుంచి సరైన సహకారం అందడం లేదని నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

మనం బాధ్యతగా ఉంటేనే ఆపగలం

Advertisement

గతంలో గోధుమలతో పాటు వచ్చి దేశవ్యాప్తంగా విస్తరించిన పార్థీనియం అదే వయ్యారిభామ, ఇటీవల పంటలను నాశనం చేసిన ఫాల్ ఆర్మీవార్మ్ అంటే కత్తెర పురుగు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. అంతర్జాతీయ ఈ-కామర్స్ సైట్ల నుంచి ధ్రువీకరణ లేని విత్తనాలను ఆర్డర్ చేయడం అంటే.. మన చేతులతో మనమే విదేశీ తెగుళ్లను మన పెరట్లోకి, దేశ పంట పొలాల్లోకి ఆహ్వానించడమే అవుతుంది. ఐక్యరాజ్యసమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సూచించినట్లుగా.. ప్రభుత్వాలు తక్షణమే ఈ-కామర్స్ కొరియర్లపై కఠిన నిఘా చట్టాలు తేవాలి. విదేశీ ఉత్పత్తులకు ‘ఫైటోశానిటరీ సర్టిఫికెట్’ తప్పనిసరి చేయాలి. వినియోగదారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అనధికార విత్తనాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ఆపాలి.

Tags

Related News

కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!

ధనత్రయోదశి నాడు వీటిని ఇతరులకు ఇచ్చారో.. మీ ఇంట్లోని ఐశ్వర్యం తుడిచిపెట్టుకుపోతుంది!

రోజూ 7 గుడ్లు తింటూ 20 కిలోలు తగ్గానన్న యువకుడు.. కొలెస్ట్రాల్ రిపోర్ట్‌పై వైద్యుల వివరణ ఇదే!

దీపావళికి అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ కావాలా.. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్ ట్రై చేయండి

దీపావళికి మీ ఇంటి చిన్న పూజ గదిని అందంగా అలంకరించాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

కష్టానికి తగిన ఫలితం దక్కకపోయినా బాధపడకండి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే

Big Stories

Advertisement
×