E-Paper
Advertisement

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Denza Z9 GT India Launch: BYDకు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ డెంజా (Denza) భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి లైనప్‌లో భాగంగా D9 లగ్జరీ MPVతో పాటు Z9 GT అనే ప్రీమియం షూటింగ్ బ్రేక్ కారును కూడా విడుదల చేసింది. ఇందులో Z9 GT ధర అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కారు ఎక్స్‌ షోరూమ్ ధరను రూ.1.57 కోట్లుగా నిర్ణయించారు. స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లు, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ కారును రూపొందించారు. ఇప్పటికే అధికారిక డెంజా డీలర్‌షిప్‌ల ద్వారా రూ.10 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

స్పోర్టీ లుక్‌ తో ఆకట్టుకునే డిజైన్

డెంజా Z9 GT చూడటానికి చాలా స్పోర్టీగా, ఆకట్టుకునేలా ఉంటుంది. షూటింగ్ బ్రేక్ బాడీ స్టైల్‌లో రూపొందించిన ఈ కారులో LED లైట్లు, 21 అంగుళాల టైర్లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, పసుపు రంగు బ్రేక్ కాలిపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లోపల లెదర్ అప్‌హోల్స్టరీ, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను అందించారు. డ్రైవర్‌ తో పాటు ప్రయాణికులకు కూడా విలాసవంతమైన అనుభూతిని అందించేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు.

అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు

Advertisement

ఈ కారులో ఫీచర్ల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. ముందు భాగంలో 50W సామర్థ్యం కలిగిన రెండు వైర్‌ లెస్ ఛార్జర్లు, వెనుకవైపు మరో 50W ఛార్జర్ ఉన్నాయి. 20 స్పీకర్లతో కూడిన డెవియాలెట్ ఆడియో సిస్టమ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. 17.3 అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్, 13.2 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే, 50 అంగుళాల ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) హెడ్‌ అప్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. నార్మల్ ORVMలకు బదులుగా డిజిటల్ మిర్రర్లను అందించారు. మైనస్ 6 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు పనిచేసే మినీ ఫ్రిజ్, హీటర్, వెంటిలేటెడ్ సీట్లు, అడ్జెస్ట్ చేసుకునే లెగ్ రెస్టులు లాంటి సౌకర్యాలు ఉన్నాయి. డ్రైవర్ సీటును ఎనిమిది విధాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

ఇరుకు ప్రదేశాల్లోనూ ఈజీ డ్రైవింగ్

డెంజా Z9 GT BYD e3 ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో ఉన్న ప్రత్యేకమైన స్టీరింగ్ టెక్నాలజీ కారణంగా కారు 15 డిగ్రీల వరకు పక్కకు తిరుగుతుంది. దీంతో ఇరుకైన రోడ్లపై ప్రయాణించడం, చిన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా రియర్ వీల్ స్టీరింగ్, ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీల కంపాస్ టర్న్ లాంటి అధునాతన సదుపాయాలు కూడా ఉన్నాయి.

2.7 సెకన్లలోనే 100 కి.మీ వేగం

Advertisement

ఈ ఎలక్ట్రిక్ కారులో 122.29kWh సామర్థ్యం కలిగిన సెకెండ్ జెనరేషన్ BYD బ్లేడ్ బ్యాటరీని ఉపయోగించారు. దీనికి మూడు ఎలక్ట్రిక్ మోటార్ల సెటప్‌ను యాడ్ చేశారు. ఇవి కలిపి 1,139bhp పవర్, 1,210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 270 కి.మీ. కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 670 కి.మీ (NEDC) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, 1,500kW DC ఇన్‌పుట్‌కు సపోర్టు చేసే ఛార్జింగ్ సామర్థ్యం కూడా ఉంది. టైర్ బరస్ట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.

భద్రత కోసం అధునాతన టెక్నాలజీ

భద్రత విషయంలోనూ డెంజా స్పెషల్ కేర్ తీసుకుంది. ఇందులో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 12 పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. వీటితో పాటు లెవెల్ 2 ADAS, ఆటోమేటెడ్ పార్కింగ్ అసిస్ట్, డ్రైవర్ ఫెటీగ్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు అందించారు. రూ.1.57 కోట్ల ధరతో భారత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

Read Also: భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

Tags

Related News

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!

SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

Big Stories

Advertisement
×