E-Paper
Advertisement

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా
Advertisement

Happy Journey OTT : ఇంటి బాధ్యతలు, కుటుంబ సమస్యలు, రోజువారీ ఒత్తిళ్లతో సతమతమయ్యే మహిళలకు కాస్త ప్రశాంతంగా గడిపే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది! అందులోనూ ఏకంగా ఫ్రాన్స్ వంటి అందమైన ప్రదేశాలకు ఉచితంగా వెళ్లే ఛాన్స్ వస్తే ఆ ఆనందమే వేరు. సరిగ్గా ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తెలుగు అడ్వెంచర్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey). ఏడుగురు మహిళలు, ఒక యూరప్ ట్రిప్, మధ్యలో ఎదురయ్యే సరదా సంఘటనలు, చివర్లో ఊహించని మలుపుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

వేర్వేరు వయసులు, భిన్నమైన నేపథ్యాలకు చెందిన ఏడుగురు మహిళలు – సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా), నయన (జినీష అలిశెట్టి), విహాన (రూప శ్రీనివాస్). వీళ్లందరికీ ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకునే అవకాశం వస్తుంది. దీంతో తమ రోజువారీ జీవితాల్లోని సమస్యలను కాసేపు పక్కనపెట్టి, కొత్త ప్రదేశాలను చూడాలని ఈ ఏడుగురూ ప్రయాణానికి సిద్ధమవుతారు.

Advertisement

ఈ ట్రిప్ బాధ్యతలను గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివ తేజ) నిర్వహిస్తుంటారు. వీరి ఆధ్వర్యంలో గ్రేట్‌అంధ్ర ట్రావెల్స్ ద్వారా మహిళలంతా యూరప్ చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత కొత్త ప్రదేశాలు, తెలియని మనుషుల మధ్య వీళ్ల ప్రయాణం ఎన్నో మలుపులు తిరుగుతుంది. మొదట్లో ఎవరికి వారు అన్నట్లుగా ఉన్న ఈ ఏడుగురు మహిళలు, ప్రయాణంలో ఎదురయ్యే చిన్నచిన్న ఇబ్బందులు, సరదా సంఘటనల వల్ల ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ, తమ జీవితాల్లోని సమస్యలను కొత్త కోణంలో చూడటం మొదలుపెడతారు. ఈ క్రమంలో వాళ్లందరి మధ్య ఒక బలమైన స్నేహబంధం ఏర్పడుతుంది.

అయితే అంతా సాఫీగా, సరదాగా సాగిపోతోంది అనుకున్న సమయంలో ట్రావెల్ ఏజెంట్ గోవింద్ వల్ల ఒక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దీంతో స్టోరీ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. అసలు ఈ లక్కీ డ్రా వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ చిక్కుల నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు? చివరికి ఈ యూరప్ ప్రయాణం ఆ ఏడుగురు మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది అనేదే ఈ సినిమా అసలు కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?

Advertisement

‘హ్యాపీ జర్నీ’ (Happy Journey)లో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా, జినీష అలిశెట్టి, రూప శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను గుట్టా బాలాజీ, గుండాల కౌశిక్ రెడ్డి నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సుబ్రమణియన్ మణికందన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 2026సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 13 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

Read Also: 20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

Tags

Related News

రణబాలిగా ఓటీటీలో విజయ్ దేవరకొండ ఊచకోత షురూ… ఈ రేంజ్ వైలెన్స్ ఎప్పుడైనా చూశారా?

ఓటీటీలోకి ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ కల్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Friday OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!

ప్రేయసిని చంపేసిన గ్యాంగ్ పై ప్రతీకారం… 12 ఏళ్లు వెనక్కి వెళ్లే యువకుడు… యానిమే లవర్స్ కు ఐ ఫీస్ట్

అడవుల్లో జోకర్ అరాచకం… 2016లో అమెరికాని షేక్ చేసిన క్లౌన్ల ఘటన… ఆ భయం వెనకున్న అసలైన కథ

ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

డైనోసార్ల ఐలాండ్‌లో చిక్కుకున్న పా పెట్రోల్ టీమ్… అగ్నిపర్వతం బద్దలైతే అదిరే ప్లాన్… పిల్లలకు ఫుల్ మీల్స్

Big Stories

Advertisement
×