E-Paper
Advertisement

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీ..సింపుల్ రెసిపీ

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీ..సింపుల్ రెసిపీ
Advertisement

Mughlai egg curry: ఎప్పుడూ చేసుకునే సాధారణ ఎగ్ కర్రీ కాకుండా కొంచెం భిన్నంగా, రిచ్ అండ్ క్రీమీ టేస్ట్‌తో ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే.. మొఘలై ఎగ్ కర్రీ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. రాయల్ వంటకాల రుచిని తలపించే ఈ కర్రీ చపాతీ, రోటీ లేదా జీరా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే తక్కువ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీని ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

ఉడికించిన గుడ్లు:5

Advertisement

ఉల్లిపాయలు:2

టమాటాలు: 2

Advertisement

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్

పెరుగు: అర కప్పు

జీడిపప్పు పేస్ట్: 2 స్పూన్లు

నూనె లేదా నెయ్యి: 3 స్పూన్లు

మసాలా దినుసులు: లవంగాలు, ఇలాచీ, చెక్క, బిర్యానీ ఆకు

కారం, ధనియాల పొడి, గరం మసాలా: రుచికి సరిపడా

కొత్తిమీర, కసూరి మేతి: తగినంత

తయారీ విధానం:

1.ముందుగా ఉడికించి పొట్టు తీసిన గుడ్లకు చిన్నగా.. గాట్లు పెట్టు కోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, చిటికెడు పసుపు, కారం వేసి ఈ గుడ్లను.. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే.. వరకు తేలికగా.. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీలోని రుచి గుడ్లకు బాగా పడుతుంది.

2. అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరి గిన ఉల్లి పాయ ముక్కలు.. లేదా ఉల్లి పాయ పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించు కోవాలి.

3. తర్వాత టమాటా.. ప్యూరీని వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. దీనిలో తగి నంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటను.. పూర్తిగా తగ్గించి, ముందుగా చిలక్కొట్టిన పెరుగు, జీడి పప్పు పేస్ట్ వేయాలి. జీడి పప్పు పేస్ట్ వేయడం.. వల్ల కూరకు అద్భుత మైన క్రీమీ టెక్చర్ వస్తుంది.

Also Read: ఆలూ స్ప్రింగ్ రూల్స్..క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ

4. మసాలా బాగా ఉడికిన తర్వాత, గ్రేవీకి సరిపడా కొద్దిగా నీరు పోసి కలపాలి. ఇప్పుడు ముందుగా.. వేయించి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేయాలి. మూత పెట్టి… ఒక 5 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. చివరగా కొద్దిగా కసూరి మేతి చేతిలో నలుపుకుని వేయాలి. ఇది కూరకు అద్భుతమైన రెస్టారెంట్ సువాసనను ఇస్తుంది. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే..గుమగుమలాడే  మొఘలై ఎగ్ కర్రీ రెడీ! దీనిని వేడి వేడి రోటీలు, నాన్స్ లేదా పులావ్‌తో తింటే.. ఆ రుచే వేరుగా ఉంటుంది. తక్కువ టైంలోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. అందుకే..ఈ సారి.. రొటీన్‌గా కాకుండా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.

Related News

నోట్లో ఇట్టే కరిగిపోయే ఆలూ పరాటా..ఈజీగా ఇలా చేయండి!

అప్పటికప్పుడు పాలతో ఇలా కలాకండ్ చేశారంటే.. అచ్చం స్వీట్ షాప్ రుచి రావడం ఖాయం!

కాలుష్యం వల్ల బయటకు వెళ్లలేకపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు ఇంట్లోనే ఈ 5 పనులు చేయండి!

దీపావళికి దేశవ్యాప్తంగా టపాసుల సందడి.. మరి ఢిల్లీలోనే తీవ్ర కాలుష్యం ఎందుకు?

పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గడానికి ఏం తింటే మంచిది?

వాల్మీకి కంటే ముందే రామాయణం రచించిన హనుమంతుడు.. మరి సముద్రంలోకి ఎందుకు పడేశాడు.. ఈ ఆసక్తికర కథ తెలుసా?

ముఖం చూడగానే మనసులో ఏముందో పట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఫేస్ రీడింగ్‌లో దిట్ట

Big Stories

Advertisement
×