E-Paper
Advertisement

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!
Advertisement

India’s Most Stunning Road Trips: కారులో లేదంటే బైక్ మీద వెళ్తూ కొత్త ప్రదేశాలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి అందాలు, కొండలు, అడవులు, సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాల మధ్య సాగే రోడ్ ట్రిప్స్ ప్రయాణాన్ని మరింత క్రేజీగా మారుస్తాయి. మన దేశంలో ఇలాంటి అద్భుతమైన ప్రయాణాలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని రహదారులు అడ్వెంచరస్ గా ఉంటే, మరికొన్ని ప్రకృతి అందాలతో మనసును కట్టిపడేస్తాయి. దేశంలోని ఐదు బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.మనాలి నుంచి లేహ్.. కొండల మధ్య సాహస ప్రయాణం!

సాహస యాత్రలను ఇష్టపడేవారికి మనాలి నుంచి లేహ్ వరకు చేసే ప్రయాణం చాలా నచ్చుతుంది. సుమారు 475 కిలోమీటర్ల ఈ మార్గం జిస్పా, సర్చు మీదుగా సాగుతుంది. రోహ్‌తాంగ్, బరాలాచా లా, టాంగ్లాంగ్ లా లాంటి ఎత్తైన పర్వత మార్గాలు ఈ ప్రయాణంలో ఆకట్టుకుంటాయి. చుట్టూ మంచు కొండలు, నీలి ఆకాశం, అందమైన లోయలు కనిపిస్తాయి. ఈ రోడ్ ట్రిప్‌ మే నుంచి సెప్టెంబర్ వరకు బాగుంటుంది.

2.ముంబై నుంచి గోవా.. సముద్ర తీరంలో అందమైన ప్రయాణం!

Advertisement

సముద్ర తీరాలను ఇష్టపడేవారు ముంబై నుంచి గోవా రోడ్ ట్రిప్‌ను తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు. సుమారు 650 కిలోమీటర్ల ఈ ప్రయాణం రత్నగిరి, తార్కర్లి మీదుగా సాగుతుంది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, మధ్యలో అందమైన తీర గ్రామాలు కనిపిస్తాయి. దారిలో ప్రశాంతమైన బీచ్‌లను చూడటంతో పాటు లోకల్ సీ ఫుడ్ ను ఆస్వాదించవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రయాణం బాగుంటుంది.

3.రాజస్థాన్‌లోని రంగుల నగరాలు.. రాజరికపు అనుభూతి!

చరిత్ర, రాజభవనాలు, కోటలను చూడాలనుకునేవారికి రాజస్థాన్ రోడ్ ట్రిప్ మంచి ఆప్షన్. జైపూర్ నుంచి జోధ్‌పూర్, జైసల్మేర్ మీదుగా ఉదయ్‌పూర్ వరకు సుమారు 1,120 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. అంబర్ కోట, జోధ్‌పూర్ నీలి వీధులు, జైసల్మేర్ బంగారు ఇసుక దిబ్బలు, ఉదయ్‌ పూర్ సరస్సుల పక్కన ఉన్న రాజభవనాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి.  అక్టోబర్ నుంచి మార్చి వరకు వెళ్లడం మంచిది.

4.బెంగళూరు నుంచి ఊటీ లేదంటేకూర్గ్.. ప్రకృతి అందాల మధ్య విహారం!

Advertisement

ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఈ ప్రయాణం చక్కగా సరిపోతుంది. బెంగళూరు నుంచి మైసూరు, బండిపూర్ మీదుగా ఊటీ లేదంటే కూర్గ్ చేరుకోవచ్చు. దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దట్టమైన అడవులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, పచ్చని కొండలు, టీ, కాఫీ తోటలు ప్రయాణంలో కనువిందు చేస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ రోడ్ ట్రిప్‌ సూపర్ ఉంటుంది.

5.గౌహతి నుంచి తవాంగ్.. ఈశాన్య భారత అందాలు!

ఈశాన్య భారతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి గౌహతి నుంచి తవాంగ్ ప్రయాణం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. సుమారు 500 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ మార్గం భాలుక్‌పాంగ్, దిరాంగ్ మీదుగా సాగుతుంది. పచ్చని లోయలు, జలపాతాలు, మంచుతో కప్పబడిన సెలా పాస్ ఈ ప్రయాణంలో స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తాయి. చివరగా తవాంగ్‌లోని ప్రసిద్ధ బౌద్ధ మఠాన్ని సందర్శించవచ్చు. మార్చి నుంచి నవంబర్ వరకు ఈ ప్రయాణం బాగుంటుంది.

Read Also: ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

Tags

Related News

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

Big Stories

Advertisement
×