E-Paper
Advertisement

వాల్మీకి కంటే ముందే రామాయణం రచించిన హనుమంతుడు.. మరి సముద్రంలోకి ఎందుకు పడేశాడు.. ఈ ఆసక్తికర కథ తెలుసా?

వాల్మీకి కంటే ముందే రామాయణం రచించిన హనుమంతుడు.. మరి సముద్రంలోకి ఎందుకు పడేశాడు.. ఈ ఆసక్తికర కథ తెలుసా?
Advertisement

Hanumad Ramayan Thrown In Sea| రామాయణం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్. కానీ హనుమంతుడు కూడా ఒక రామాయణాన్ని రచించారని మీకు తెలుసా? అది కూడా తన చేతులతో కాకుండా, స్వయంగా తన గోళ్లతో రాతిపై చెక్కారట. అయితే అంత భక్తితో రాసిన రామాయణాన్ని చివరకు హనుమంతుడే సముద్రంలో పడేశారట. అసలు ఆయన అలా ఎందుకు చేశారు? అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. దీని వెనుక మహర్షి వాల్మీకికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉంది.

హిమాలయాల్లో రామాయణం రచన

రావణుడిపై విజయం సాధించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చారు. రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత హనుమంతుడు కొంతకాలం ఆయనకు సేవ చేశారు. ఆ తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి మహాశివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కూడా శ్రీరాముడితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉండేవారు. ఆ భక్తితోనే శ్రీరాముడి జీవిత చరిత్రను ఒక పెద్ద శిలపై తన గోళ్లతో చెక్కడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు రామాయణాన్ని రచించారు. ఈ రచనను హనుమద్ రామాయణం అని పిలుస్తారు.

హనుమంతుడి రామాయణాన్ని చూసి నిరాశ చెందిన వాల్మీకి

Advertisement

మరోవైపు మహర్షి వాల్మీకి కూడా రామాయణాన్ని రచించారు. ఆ రచనను శివుడికి సమర్పించడానికి కైలాసానికి వెళ్లగా అక్కడ ఆయనకు హనుమంతుడు కనిపించారు. ఒక పెద్ద శిలపై చెక్కిన రామాయణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందులోని భక్తి, భావాలు చూసి తన రచనకు అంతటి ప్రాధాన్యత దక్కకపోవచ్చని బాధపడ్డారు. వాల్మీకి బాధను గమనించిన హనుమంతుడు అందుకు కారణం అడిగారు. అప్పుడు వాల్మీకి.. తాను ఎంతో శ్రమపడి రామాయణం రచించానని, అయితే తన రామాయణం కంటే హనుమంతుడి రచన గొప్పగా ఉందని, ప్రజలు తన రచనను పట్టించుకోకపోవచ్చని వాల్మీకి చెప్పారు.

తన రామాయణాన్ని సముద్రంలో పడేసిన హనుమంతుడు

వాల్మీకి బాధను అర్థం చేసుకున్న హనుమంతుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక భుజంపై రామాయణం చెక్కిన శిలను, మరో భుజంపై వాల్మీకిని కూర్చోబెట్టుకున్నారు. అనంతరం సముద్రం దగ్గరకు వెళ్లి తన రచనను శ్రీరాముడికి అంకితం చేస్తూ సముద్రంలో పడేశారు. మరో భక్తుడి మనసును బాధపెట్టకూడదనే ఉద్దేశంతో తన అద్భుతమైన రచనను త్యాగం చేశారని ఈ కథ చెబుతోంది.
ఈ సంఘటన హనుమంతుడి నిస్వార్థ భక్తికి, వినయానికి నిదర్శనంగా చెబుతారు.

వాల్మీకి తులసీదాస్‌గా మళ్లీ జన్మించారని నమ్మకం

Advertisement

హనుమంతుడి త్యాగానికి వాల్మీకి ఎంతో ముగ్ధులయ్యారు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో మరో రామాయణాన్ని రచిస్తానని మాట ఇచ్చారని ప్రాచీన కాలంలో ఒక కథనం ఉంది.
కలియుగంలో వాల్మీకి తులసీదాస్‌గా జన్మించారు. ఆయన అవధీ భాషలో రామచరితమానస్‌ రచించారు. హనుమాన్ చాలీసాను కూడా రచించి ఆంజనేయుడి గొప్పతనాన్ని కీర్తించారు.

Also Read: భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు

హనుమంతుడి రామాయణానికి కాళిదాసుతో సంబంధం ఉందా?

మరో ఆసక్తికరమైన కథనం.. కాళిదాసు కాలానికి సంబంధించినది. సముద్రం ఒడ్డుకు ఒక రాతి పలక కొట్టుకొచ్చిందని చెబుతారు. దానిపై ఉన్న అక్షరాలను చూసిన కాళిదాసు, అవి హనుమంతుడు రచించిన రామాయణంలోని భాగాలని గుర్తించారట. అయితే ఈ కథనాలకు చారిత్రక ఆధారాలు లేవు. ఉత్తర భారత దేశంలో ప్రచారంలో ఉన్న సంప్రదాయ కథలు మాత్రమే.

హనుమంతుడి కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే. ప్రతిభ ఉన్నవారు గొప్పవారే, కానీ ఎదుటివారి ఆనందం కోసం తమ గొప్పతనాన్ని కూడా పక్కన పెట్టగలిగినవారే నిజమైన మహానుభావులు.

Also Read: మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

Related News

ముఖం చూడగానే మనసులో ఏముందో పట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఫేస్ రీడింగ్‌లో దిట్ట

‘నా వల్ల కాదు’.. ఇంటి పనులు చేయమంటే మీ భాగస్వామి తప్పించుకుంటున్నారా? దీనివల్ల వచ్చే సమస్యలు ఇవే

విరిగిపోయిన పాలతో ఇలా అంగూరీ రసమలై చేయండి.. బేకరీ స్టైల్ టేస్ట్ గ్యారెంటీ!

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగుల పాస్తా.. తయారీ విధానం మీ కోసం!

ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం.. బెడ్ రూంలో ఇలా చేయండి చాలు

డేటింగ్ యాప్ ఉపయోగించండి.. పెళ్లి కుదరకపోతే డబ్బులు రీఫండ్

Big Stories

Advertisement
×