parenting tips: పిల్లల పెంపకం సులభమైన విషయం కాదు.. జీవితంలో ఎదగాలంటే చిన్నప్పుడు పిల్లలకు వేసే మార్గమే దారిచూపిస్తుంది. లేదంటే పిల్లలు తప్పు దారి నడిస్తే వారి జీవితం పాడవుతుంది. అందుకే చిన్నప్పుడే తల్లదండ్రలు ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి. లేదంటే పిల్లలు సరైన మార్గంలో వెళ్లలేరు. పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. తల్లదండ్రులు తమ పిల్లలను మంచి వ్యక్తులుగా ఎదగడానికి చిన్న చిన్న విలువలు నేర్పించాలి.
పాజిటివ్‌గా ఆలోచించడం నేర్పించాలి:
పిల్లలు కొన్ని విషయాలను పాజిటివ్‌గా, ప్రశాంతంగా ఆలోచించేలా అలవాటు చేయాలి. వారికి చదువుల్లో కాని ఆటల్లో కాని కావాల్సిన ప్రేరణ అందించాలి. ఇందువల్ల పిల్లల్లో వారు జీవితంలో ఏదైనా సాధించగలగాలి అనే ఆలోచన మెుదలవుతుంది. తల్లిదండ్రులు ప్రతి విషయానికి వారి మీద చిరాకు పడకుండా నెమ్మదిగా చెప్పాలి.. లేదంటే వారు తప్పడు మార్గం వైపు వెళ్లేందుకు అవకాశం కల్పించిన వాళ్లం అవుతాం.
విలువలు తేలియజేయడం:
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు విలువ తేలియకుండా పెంచుతున్నారు. దీని వల్ల పిల్లలకు కష్టం అంటే ఏమిటో తేలియడం లేదు. వారు ఏది అడిగిన నిమిషంలో వారి ముందు ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు అది ఎలా వస్తుంది, అది కొనివ్వడానికి తల్లదండ్రుల శ్రమ ఎంత ఉంది అనే అంశాన్ని నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు విలువల గురించి తెలుస్తుందని చేప్తున్నారు. అలాగే పెద్దలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి మరియు పెద్దలతో సమయం కేటాయించేలా అలవాటు చేయాలి.
సహాయపడే గుణం:
మనం పిల్లలు జీవితంలో ఏదైనా సాధించాలంటే వారు తప్పకుండా స్వార్ధపరులై ఉండాలని భ్రమపడుతుంటాం. కాని ఇది చాలా తప్పు. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతర అవసరలకు స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. తద్వారా వారు ఒంటరిగా ఉన్నామనే భావనను కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఇతరులకు సహాయడపే కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని అలవాటు చేయాలి. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. దీనివలన వారిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి.
పిల్లలపై అనవసరంగా కోపగించుకోవద్దు:
మనం కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతాం. మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి.
పిల్లలను బాధ్యతలు అప్పగించడం :
పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనందరం ఎక్కువగా వారు చదువుకోవాలని కోరుకుంటాం. ఎంత చదివితే అంతర ప్రయోజనం అని భావిస్తాం. అయితే పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పజెప్పాలి. దీనివలన వారిలో కృషి, పట్టుదల పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో చిన్నప్పటి నుండే తెలుస్తుంది. రోజూ మన ఇంటిలో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి.
తల్లిదండ్రలు పిల్లల ముందు సంతోషంగా ఉండాలి:
భార్యభర్తల మధ్య సఖ్యతలేని పిల్లలకంటే అన్యూన్యంగా ఉండే భార్యభర్తలు పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారని చాలా అధ్యయనలు తెలుపుతున్నాయి. భార్యభర్తల సఖ్యతగా ఉండడం అనేది కూడా పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. చాలామంది పిల్లలు అయితే అమ్మతోనో లేదా నాన్నతో మాత్రమే చనువుగా ఉంటారు. కొందరు ఎవ్వరితో పెద్దగా మాట్లాడరు. వారికి సంబంధించిన ఏ విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా వారికి తెలియజేయాలి. వారికి జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చిన వారు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర వారి కష్టాన్ని చెప్పుకునేలా చిన్నప్పటి నుండి వారిని ప్రోత్సహించాలి.
Also Read: మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..
సవాళ్లను ఎదుర్కునే అలవాటు చేయడం:
పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టకొని దాని మీద ఫోకస్ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సావాళ్లనైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారికి ప్రోత్సహించాలి. వారి ఏ పనినైనా కష్టంతోకాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నపటి నుండి బలంగా నాటుటుతంది.
ఒత్తిడిని నియంత్రించడం:
చాలామంది వారి జీవితంలో ఉండే ఒత్తిడి యొక్క ప్రభావాన్ని మన కుటుంబసభ్యలపై లేదా పిల్లలపై చూపిస్తుంటాం. ఇది పిల్లలలో మన పట్ల నెగిటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రవులలా చూడటం ప్రారంభిస్తారు. అందుకోసమే మన ఒత్తిడిని, కోపాన్ని వారి మీద చూపించకూడదు. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని మాత్రం ప్రేమగానే దగ్గరకు తీసుకొని మాట్లాడం అలవరచుకోవాలి. ఇలా చేయడం వలన వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతీ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.